రాజధాని వికేంద్రీకరణ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్నరాజకీయ పరిణామాలు రాయలసీమ ప్రజల మనోభావాలను దెబ్బ తీసేవిధంగా ఉన్నాయి అని రాయలసీమకు చెందిన మేధావులు, ఉద్యోగులు,విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు.
ఈరోజు అనంతపురం ప్రెస్ క్లబ్ లో జరిగిన వారు ఒక మేధో మథనం కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర రాజకీయ పరిణామాలను చర్చించారు.
వివిధ వర్గాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సభ కు సీనియర్ జర్నలిస్ట్ రసూల్ అధ్యక్షత వహించగా కర్నూలు, కడప,నెల్లూరు, ఒంగోలు జిల్లా ల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు పోతుల నాగరాజు మాట్లాడుతూ గ్రేటర్ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం మనం ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చిందని, ఇపుడున్న పరిస్థితులలో రాయలసీమకు సరైన న్యాయం జరిగేలా లేదని అభిప్రాయపడ్డారు.
ఈ ఉద్యమ కార్యాచరణను ,అజెండాను,జెండా ను తయారు చేసుకోవాలని సమావేశానికి హాజరయిన వారు అభిప్రాయపడ్డారు.ఈ ప్రాంత ప్రజలను ,ప్రాంతాన్నీ పాలకులు నిర్లక్ష్యం చేశారని చెబుతూ మూడు రాజధానుల పేరుతో ను,అమరావతి పేరుతో ను కులాల వారిగాను, ప్రాంతాల వారిగాను విడగొట్టి రాజకీయ లు చేస్తున్నారు అని ఇప్పటికయినా రాయలసీమ ప్రజలు ఉద్యమ దారి పట్టాలని చెప్పారు.
త్వరలో అన్ని జిల్లాల్లో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి, అన్ని విశ్వవిద్యాలయాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం దశల వారిగా నిర్మించాలని ఆ దిశగా మనము పనిచేద్దాం అని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ ను ప్రకటించారు. అందులోని అంశాలివి;
గ్రేటర్ రాయలసీమ జిల్లాల్లో సదస్సులు ఏర్పాటు చేయాలి. ఇప్పటి వరకు రాయలసీమ ఉద్యమం లో పనిచేస్తున్న వారిని గుర్తించి ఒకవేదిక మీద అభినందించాలి. ఆ జిల్లాలో బస్సు యాత్ర చేపట్టాలి. పార్లమెంట్ సమావేశాలలో అన్ని పార్టీల మద్దతు కు లేఖలు అందచేయాలి.మార్చి చివరి వారంలో లక్ష మందితో ఒక బహిరంగ సభను నిర్వహించి, రాష్ట్ర సాధన కోసం అన్నీ పార్టీ ల నాయకులను ఆహ్వానించి రాష్ట్ర ఉద్యమం కోసం కలసి పనిచేసే విధంగా ఉద్యమం నిర్మాణం చేపట్టాలని సమావేశం తీర్మానం చేసింది
ఈ కార్యక్రమంలో ప్రభాకర్, రామచంద్ర,రవి,జాకీర్, భాస్కర్ రెడ్డి, రామన్న,సురేశ్, నాగలింగయ్య,నాగభూషణం, శుభాన్, నారాయణ నాయక్,విద్యార్థులు, ప్రసాద్, షణ్ముగ,రాజ్ కుమార్,న్యాయ వాదులు, పుల్లయ్య, ఆనంద్,మానవ హక్కుల నాయకులు భాస్కర్,రంగస్వామి, చింతన్న,ఐఎంఎం బాషా,డా. మాధవ్ రావ్త దితరులు పాల్గొన్నారు.