రాజధాని తరలింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ మొదలయింది.తొలిరోజున అమరావతి రైతులకు మరింత వూరట దొరికింది. నిన్న శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లును, సిఆర్ డిఎ రద్దు బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదించిన సంగతి తెలిసిందే. ఇపుడు హైకోర్టు కూాడా ఈ విషయాన్ని అంతఅర్జంటు గా పరగణించేందుకు నిరాకరించింది.ఇంకా బిల్లు కౌన్సిల్ ఆమోదం పొందాల్సి ఉందని, దీనికి చాలా సమయం పడుతుతుంది కాబట్టి కేసును ఫిబ్రవరి 26 కి వాయిదా వేసింది. అంటే కోర్టు లెక్క ప్రకారం కూడా ఒక నెలరోజులు ఏ ఫైలు కదపడానికి వీల్లేదు. అంతేకాదు,ఏ డిపార్టమెంటును విశాఖకు కదిలించరాదని, అలా తరలిస్తే ఆఖర్చును వ్యక్తిగతంగా భరించాల్సి ఉంటుందని కూడా కోర్టు స్పష్టం చేసింది.
రైతుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అశోక్ భాన్ హాజరయితే, ప్రభుత్వం తరఫున మరొక సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు.
మూడు రాజధానులు, సీఆర్‌డీఏ ఉపసంహరణ, రాజధాని తరలింపుపై విచారణ జరిగుతున్నపుడు బిల్లులు ఏస్థాయిలో ఉన్నాయని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ సుబ్రమణ్యంను ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జేకే మహేశ్వరి వాకబు చేశారు.
శాసనసభలో బిల్లులు ఆమోదం పొందిన తర్వాత బిల్లు శాసన మండలికి వెళ్లాయని, ఎగువ సభ బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలన కోసం పంపిందని, వివరించారు
దీనితో బిల్లులపై తక్షణ విచారణ అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. దీని మీద అశోక్ భాన్ అభిప్రాయం అడిగారు. హైకోర్టు విచారణ జరపకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు తరలిపోతాయని, అందువల్ల జరపాలని పిటిషనర్ల కోరారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి మహేశ్వరి స్పందిస్తూ విచారణ పూర్తయ్యేలోపు కార్యాలయాలు తరలించరాదని ఆదేశించారు. అలాకాకుండా ఏదైనా కార్యాలయాన్ని తరలిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి హైకోర్టు వాయిదా వేసింది.