కేంద్ర జలవనరుల శాఖ ఆధికారుల ఆధ్వర్యంలో 21 జనవరి 2020 న డిల్లీ లో గోదావరి, కృష్ణా నదీజల యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. తెలంగాణ, అంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కీలక అధికారులు పాల్గొని నీటి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆంద్రప్రదేశ్ జలవనరుల అధికారులు కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ కు తరలించాలని కోరారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనేది కీలక అంశం. ఈ కేంద్రం కర్నూలులో ఏర్పాటు చేయడం వలన అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆంద్రప్రదేశ్ విభజనచట్టం పదోవ భాగం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జలవనరుల నిర్వహణ, అభివృద్ధి అంశాలను వివరిస్తుంది. గోదావరి కృష్ణా నదీజల యాజమాన్య మండలి గురించి ఇందులో సమగ్రంగా తెలిపారు.
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు రాష్ట్ర అవతరణ దినం నుండి అరవైరోజులలో ఏర్పాటు చేయాలి. గోదావరి నదీ యాజమాన్య బోర్డు తెలంగాణలో, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆంద్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలి. ఈ రెండు బోర్డుల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కేంద్రం ఒక శిఖరాగ్ర మండలి(Apex Council) ఏర్పాటు చేస్తుంది.ఇందులో కేంద్ర జలవనరుల శాఖమమంత్రి, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. బోర్డుల నిర్వహణ, కీలక సమస్యల పరిష్కారం, ట్రిబ్యునల్ విచారణలకు పంపడం తదితర అంశాలను ఈ మండలి పర్యవేక్షిస్తుంది.
కామెంట్
హరనాథ రెడ్డి గారు మీ పోస్ట్ చదివాను. బాగుంది. కాని అది ప్రస్తుతం మేక చన్ను లాంటిది.విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలు అనుమతితో కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయవలసి వుంది. కాని తెలంగాణ ప్రభుత్వం అయిదు ఏళ్లు గా అంగీకరించ లేదు. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చిన తర్వాతనే అంగీకరించుతానని మొండి కేసింది. ఒక దఫా నోటిఫై జరిగితే అది జారీ చేసే ఆదేశాలు రెండు రాష్ట్రాలు పాటించాలసినదే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నామ మాత్రంగా వుంది : వి. శంకరయ్య
బోర్డులలో భారత ప్రభుత్వ సెక్రటరీ లేదా అదనపు సెక్రటరీ స్థాయి అధికారి చైర్మన్ గా ఉంటారు. కేంద్ర జలవనరుల నిపుణుడు, కేంద్ర ఛీప్ ఇంజనీర్, ఇరురాష్టాల ఛీప్ ఇంజనీర్ స్థాయి అధికారులు తదితరులు ఉంటారు. ట్రిబ్యునల్ తీర్పులు, ఒప్పందాల ప్రకారం రాష్ట్రలకు నీటి సరఫరా, విద్యుచ్చక్తి పంపిణి, కొత్త ప్రాజక్టు లకు సాంకేతిక అనుమతులు, కేంద్ర ప్రభుత్వం అదేశాలు, అప్పగించిన ఇతర విధులు ఇవి చేపట్టాలి. బోర్డు ఖర్చులు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు భరించాలి.
తుంగభద్ర బోర్డు యధాతథంగా ఉంటుంది. రెండు రాష్ట్రాల ప్రతినిధులు ఉంటారు. ఇది తుంగభద్ర ఆయకట్టు లోని ఎగువ గట్టు , దిగువ గట్టు కాలువలు, రాజోలిబండ మళ్లింపు పధకం దీని పరిధిలో ఉంటాయి.దీని కేంద్రం హోస్పేట్లో ఉంది.
గోదావరి కృష్ణా నదీ యాజమాన్య బోర్డుల చైర్మన్ గా ప్రస్తుతం చంద్రశేఖర్ అయ్యర్ ఒక్కరే కొనసాగుతున్నారు. రెండుబోర్డులు కలిసి ఉన్నాయి.
కృష్ణనదీ యాజమాన్య బోర్డును వేరు చేసి దాని కేంద్రాన్ని విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ అధికారులు అడిగారు. వచ్చే సమావేశాలలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు కేంద్రం కర్నూలులో నెలకొల్పడవలన బహుళ ప్రయోజనంగా ఉంటాది.
కృష్ణానది మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా శ్రీశైలం ప్రాజక్టు కీలకమైనది. వరదల అంచనాకు,నియంత్రణకు వ్యూహాత్మకంగా ఉంటుంది. ఇరు రాష్ట్రాలలో నిర్మాణంలో ఉన్న కీలక ప్రాజక్టులు శ్రీశైలం ప్రాజెక్టు ఆధారంగా సాగుతున్నాయి. పర్యవేక్షణకు, ప్రాజక్టుల నీటికేటాయింపులకు, టెలిమెట్రిలు పర్యవేక్షణ తదితర కీలక అంశాలు కర్నూలు నుండి నిర్వహణ సౌకర్యంగా ఉంటుంది. వెనుకబడిన, ఎన్నో అవకాశాలను కోల్పోయిన కర్నూలు నగరంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయడం సమంజసంగా ఉంటుంది.
(డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి,వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం,అనంతపురము)