తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. కౌన్సిల్ సమావేశంలో ఉన్నపుడు,అందునా విప్ జారీ చేసినపుడు ఇలా రాజీనామా చేయడం పార్టీకి షాక్ లా తగిలింది. ఆయన రాజీనామా లేఖ రాసిన తీరు చూస్తే పార్టీకి రాజీనామా చేసినట్లు అనిపిస్తుంది. చివరకు వచ్చాకే ఆయన రాజీనామా చేసింది కౌన్సిల్ కు అని తెలుస్తుంది.
అయితే, ఆయన రాజీనామా చేసింది తెలుగుదేశం మీద అలిగికాదు, అమరావతిని మార్చి మూడు రాజధానులు చేస్తున్నందుకు జగన్ ప్రభుత్వం మీద బాధపడి ఆయన కౌన్సిల్ సభ్యత్వానికి రాజీానామ చేశారు. ఈ లేఖను తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి రాశారు.
మూడు రాజధానులను ప్రతిపాదనను తాను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్ర విభజన ప్రతిపాదనరాగానే, విభజిత నవ్యాంధ్ర రాష్ట్ర రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలనికోరుతూ అసెంబ్లీ లోనూ బయటన ప్రయత్నించి ఉన్నాను.
తెలుగుదేశం పార్టీలో మీరు నన్ను అనేక విధములుగాప్రోత్సహించినందుకు గాను ధన్యవాదాలు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ గారు నా పట్ల చూపిన అభిమానానికి మన: పూర్వక ధన్యవాదములు.
2019 సాధారణ ఎన్నికలలో ప్రత్తిపాడు శాసన సభ నియోజకవర్గం నుంచి పోటీ చేేసే అవకాశం నాకు కల్పించారు. ఎన్నికల్లో ఓటమి చవి చూసినా ప్రత్తి పాడు ప్రజలూ ఓటర్లు నాపట్ల చూపిన ఆదరాభిమానాలు మవరలేను.
2019 ఎన్నికల అనుభవాల దృష్ట్యా భవిష్యత్తు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరాదనినేను నిర్ణయించుకున్నారు. పైకారణాల రీత్యా అమరావతి రాజధాని విడిపోతున్నందుకు నేను నాఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నాను.