కర్నూలుకు హైకోర్టు తరలింపు సాధ్యమేనా?

(టి.లక్ష్మీనారాయణ)
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(ప్రిన్సిపల్ హైకోర్టు)ను కర్నూలుకు తరలించడానికి అవసరమైన చర్యలు చేపడతామని ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులో పేర్కొన్నారు.
The Draft Bill:
“The Andhra Pradesh Decentralisation
and Inclusive Development of All Regions Act, 2020”.
Judicial Capital:
“The Government shall initiate steps to seek relocation of the Principal Seat of High Court of Andhra Pradesh to the Judicial Capital of Kurnool and for constitution of bench(es)of the High Court of Andhra Pradesh in accordance with the
procedure prescribed under the Andhra Pradesh Reorganisation Act, 2014”
అంటే, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రపతి నోటిపై చేస్తేనే తరలించడం సాధ్యమవుతుంది. ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం, అంతిమంగా రాష్ట్రపతి ఆమోదించి, నోటిపై చేసిన ప్రక్రియ తదనంతరమే అమరావతిలో హైకోర్టు నెలకొల్పబడింది. మళ్ళీ, ఈ ప్రక్రియ అంతా జరగాలి. రాజ్యాంగబద్ధమైన ఆ వ్యవస్థలన్నీ అంగీకరించాలి. అప్పుడే, రాష్ట్ర శాసన సభ రూపొందిస్తున్న చట్టంలో పొందుపరచిన మేరకు హైకోర్టును కర్నూలుకు తరలించడం సాధ్యమతుంది. ఈ అంశాన్నే వివరిస్తూ జనవరి 2వ తేదీన నేను ఒక పోస్టు పెట్టాను.
“1. హైకోర్టును కర్నూలుకు తరలించడాన్ని మీరు బలపరుస్తున్నారా? లేదా? అని కొందరు మిత్రులు అడిగారు.
2. హైకోర్టును కర్నూలుకు తరలించడం సాధ్యమేనా? అని మరికొందరు మిత్రులు అడిగారు.
3. దేశంలోని పలు రాష్ట్రాల్లో రాజధాని ఒక చోట, రాష్ట్ర హైకోర్టు మరొక చోట ఉన్న ఉదంతాలు అందరికీ తెలిసిందే.
4. 1937లో పెద్ద మనుషుల మధ్య జరిగిన “శ్రీబాగ్ ఒడంబడిక” ను గౌరవించి, రాజధాని ఒక ప్రాంతంలో, హైకోర్ట్ మరొక ప్రాంతంలో నెలకొల్పుకొంటే సముచితంగా ఉంటుందని భావించే వాళ్ళల్లో నేను ఒకడిని.
5. రాజకీయ పార్టీలు సరియైన సమయంలో నిబద్ధతతో వ్యవహరించక పోవడం పర్యవసానంగా ఆ ఒప్పందం అమలుకు నోచుకోలేదు.
6. నాకు న్యాయ శాస్త్రంలో ప్రావీణ్యం లేదు. రాష్ట్ర విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం -2014 అమలులో భాగంగా అనేక అడుగులు చట్టబద్ధంగా ముందుకు పడ్డాయి. అందులో ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజన, రాష్ట్రపతి “నోటిఫికేషన్” మేరకు అమరావతిలో “ప్రిన్సిపల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్” ఏర్పాటు చేయబడి, ఏడాదిగా అక్కడి నుండే పని చేస్తున్నది. ఇప్పుడు తరలించడం సాధ్యమేనా! అన్న సంశయం నాకూ ఉన్నది.
7. రాష్ట్ర విభజన చట్టంలో పొందు పరచిన మేరకు “ప్రిన్సిపల్ హైకోర్ట్” ను రాష్ట్రపతి ఆదేశానుసారం నెలకొల్పారు. నేడు తరలించాలంటే, రాష్ట్రపతి గతంలో జారీ చేసిన “నోటిఫికేషన్”ను ఉపసంహరించుకొని, మళ్ళీ “నోటిఫికేషన్” జారీ చేయాలి.
8. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిఫార్సు మేరకు, సుప్రీం కోర్టు చేసిన సిఫార్సుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చేసిన సిఫార్సు మేరకు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేశారు. మళ్ళీ, ఈ ప్రక్రియ అంతా జరగాల్సి ఉంటుందని నాకున్న పరిజ్ఞానంతో భావిస్తున్నా. అది సాధ్యమా! కాదా! అని న్యాయ నిపుణులు చెప్పాలి, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు చెప్పాలి.
9. విభజన చట్టంలో పొందు పరచిన ఆ భాగాలను క్రింద యదాతథంగా ప్రస్తావిస్తున్నాను.”
Andhra Pradesh Reorganization Act – 2014
” PART – IV: HIGH COURT
Section – 31: High Court of Andhra Pradesh:
Sub-section – (2) The Principal seat of the High Court of Andhra Pradesh shall be at such place as the President may, by notified order, appoint.
(3) Notwithstanding anything contained in sub-section (2), the Judges and division court’s of the High Court of Andhra Pradesh may sit at such other place or places in the state of Andhra Pradesh other than its principal seat as the Chief Justice may, with the approval of the Governor of Andhra Pradesh, appoint.”