అమరావతి రాజధాని నిర్మాణానికి తీసుకువచ్చిన క్యాపిటల్ రీజియన్ డెవెలప్ మెంట్ అధారిటీ (CRDA) చట్టం. 2104 ను ఉపసంహరించేందుకు ఉద్దేశించిన బిల్లును మునిసిపల్ మంత్రి బోత్సా సత్యనారాయణ ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనితో క్యాపిటల్ రద్దువుతుంది. కాక పోతే ఈ ప్రాంతం అభివృద్ధికి మెట్రోపాలిటన్ రీజియన్ అని కొత్త సంస్థ ప్రారంభిస్తారు. ఈ సంస్థ పేరు అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవెలప్ మెంట్ అధారిటీ (AMRDA)అని పిలుస్తారు. సిఆర్ డిఎ రద్దు కాగానే ఎఎంఆర్ డిఎ వారసురాలిగా మనగడలోకి వచ్చి, సిఆర్ డిఎ బాధ్యతలను స్వీకరిస్తుంది. బోత్స ప్రవేశపెట్టిన సిఆర్ డిఎ ఉసంహరణ బిల్లు విశేషాలివే.
1.ఎపి సిఆర్ డిఎ రద్దవుతుంది. దీని స్థానంలోకి అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవెలప్ మెంట్ అధారిటీ (AMRDA) వస్తుంది. సిఆర్ డిఎ రద్దు తతంగం ముగియగానే ఎఎంఆర్ డిఎ నోటిఫికేష్ వస్తుంది.
2. ఎపిఆర్ డిఎ విడుదల చేసిన బాండ్లకు, అప్పులకు వగైరాలన్నింటి బాధ్యత ఎఎంసిఆర్ డిఎకు బదిలీ అవుతాయి. వాటికి సిఆర్ డిఎ చట్టం లోని 28(4) ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది.
3. సిఆర్ డిఎ చట్టం రద్దుకు ముందు ఎపి సిఆర్ డిఎ కింద ఉండే ఉద్యోగులందరిని ఇలాంటిసంస్థల్లోకి బదిలీ చేస్తారు.
4. లాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన వారికి సిఆర్ డిఎ లో పొందుపర్చిన విధంగానే రక్షణ ఉంటుంది. హక్కులుంటాయి. అంతేకాదు, డెవలప్ చేసిన ప్లాట్లకు ఈ హక్కులు వర్తిస్తాయి.
5. అసైన్డు భూములు కోల్పోయిన వారికి కూడా ఇతర రైతులలాగే డెవెలప్ చేసిన ప్లాట్లు అందిస్తారు. వారికి నెలకు రు.5వేలు పరిహారం ఉంటుంది. ఇది చట్టప్రకారం కొనసాగుతుంది.దీనిని మరొక ఐదేళ్లకు పొడిగిస్తారు.
6.పూలింగ్ కు భూుములిచ్చిన వారికి యాన్యూటీ పరిహారం పాత చట్టం ప్రకారమేకాకుండా, మరొక ఐదేళ్లు పాటు అదనంగా కొనసాగిస్తారు.
7. పాత సిఆర్ డిఎ చట్టం ఇచ్చిన హక్కులన్నీంటిని ఎఎం ఆర్ డిఎ ఇచ్చినట్లుగా పరిగణిస్తారు.
10. సిఆర్ డిఎ కాలంలో వచ్చిన మాస్టర్ ప్లాన్లు, జోనల్ డెవెలప్ మెంటుప్లాన్లు, టౌన్లు ప్లాన్లు కొనసాగుతాయి.
11. సిఆర్ డిఎ చట్టంలోని సెక్సన్ 28(1) కింది జారీ చేసిన బాండ్లు, ఇతర ఆర్థిక నిర్ణయాలు ఇక ముందు ఎఎం ఆర్ డిఎ ఇచ్చినట్లుగా పరిగణిస్తారు.
12. సిఆర్ డిఎ తో చేసుకున్న కాంట్రాక్టులన్నీ ఎఎం ఆర్ డిఎ తో చేసుకున్నట్లు మారతాయి.
13. సిఆర్ డిఎ నిర్వహిస్తూ వచ్చిన సోషల్ సక్యూరీటి ఫండ్ ఇక నుంచి ఎఎంఆర్ డిఎ ఫండుగా మారుతుంది.
14. ఎంఎం ఆర్ డిఎ ప్రాంతానికి ఆర్థిక వనరుల అందుబాటును బట్టి అభివృద్ధి చేస్తారు.
15. సిఆర్ డిఎ కువచ్చిన కన్సెషన్లు, టాక్స్ మినహాయింపులు, లైసెన్సులు, ప్రయోజనాలు, ప్రత్యేక హోదాలన్ని ఎఎం ఆర్టీఏకు వచ్చినట్లు పరిగణిస్తారు.
16. సిఆర్ డిఎకు లోన్లు తీసుకునేటపుడు గాని, ఇతర సందర్భాలలోగాని, ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలన్నీఅన్నీ ఎఎం ఆర్ డిఎ హయాంలో కూడా కొనసాగుతాయి.
17.పాతచట్టం రద్దయినందున పాత కార్యక్రమాలు అమలుచేయడంలో ఏదైనా ఇబ్బంది ఎదురయితే, ప్రభుత్వం నియమాలను బట్టి ప్రత్యేక ఉత్తర్వులిచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలుతీసుకుంటుంది.