ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చరిత్ర కొద్ది సేపట్లో ముగియబోతున్నది. ఈ రోజు సమావేశమవుతున్న అసెంబ్లీ దీని మీద కీలక నిర్ణయాలను తీసుకుంటూన్నది. అసెంబ్లీ లో ప్రవేశపెట్టాల్సినబిల్లులను క్యాబినెట్ చర్చిస్తున్నది. క్యాబినెట్ ముందు ఏడు కీలకమయిన అంశాలున్నాయని చెబుతున్నారు. ఇందులో ప్రముఖమయినది సిఆర్ డిఎ ఉపసంహరణ బిల్లు.
అమరావతి రాజధాని నిర్మాణానికి బాటవేసిన సిఆర్ డిఎ (క్యాపిటల్ రీజియన్ డెవెలప్ మెంటు అధారిటీ) బిల్లును తెలుగుదేశం ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇది డిసెంబర్ 31, 2014 నుంచి అమలులోకి వచ్చింది. ఇపుడు ఈబిల్లును ఉపసంహరించుకుంటే అమరావతి రాజధాని ప్రాంతం అనేది మాయముుతుంది.
ట్రెండిగ్ తెలుగు న్యూస్ కు అందిన సమాచారం ప్రకారం సిఆర్ డిఎ రద్దు కాగానే అంతకు ముందున్న విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి పట్టణ ప్రాంత అభివృద్ధి అధారిటీని లేదా అమరావతి మెట్రోపాలిటన్ డెవెలప్ మెంటు అధారిటీని పునరుద్ధరిస్తారు.
క్యాబినెట్ ముందున్న మిగతా నిర్ణయాలు ఇవే
ప్రతి గ్రామ సచివాలయంలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేయనున్న క్యాబినెట్.
పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు పై చర్చ.
రాజధాని ప్రాంత ఏరియా మొత్తాన్ని మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు పై ప్రతిపాదన.
టేబుల్ ఐటమ్ గా టీడీపీ నేతలు చేసిన ఇన్సైడ్ ట్రేడింగ్ వ్యవహారం పై లోకాయుక్తకు అప్పచెప్పనున్న మంత్రి వర్గం.
రైతులకు ఇచ్చే పరిహారం పైన పెద్ద ఎత్తున కసరత్తు చేయనున్న మంత్రి వర్గం.11 వేల రైతు భరోసాకేంద్రాల ఏర్పాటు. మెరుగైన ప్యాకేజీ ఇస్తారు.
అసెంబ్లీ సమావేశాలు
నేటి నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 9గంటలకు కేబినెట్ సమావేశమవుతుంది.
10 గంటలకు బీఏసీ సమావేశం కానుంది. తర్వాత 11గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.అసెంబ్లీ ముందుకు సీఆర్డీఏ చట్టం రద్దు, జోనల్ అభివృద్ధి కౌన్సిల్ బిల్లులు రానున్నాయి.
బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.అలాగే, ‘మూడు రాజధానుల’ నిర్ణయంపైనా కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది.
న్యాయపరమైన సమస్యలు అధిగమించేందుకు, అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే .. పరిపాలనా వికేంద్రీకరణ చేస్తామని ప్రభుత్వం బిల్లులో పేర్కొననుందని తెలిసింది.
మొత్తానికి అమరావతి లో టెన్షన్ అలుముకుంది. అనుకున్నది సాధించేందుకు అధికార పక్షం… ఎలాగైనా అడ్డుకునేందుకు విపక్షం ఇప్పటికే వ్యూహాలు రచించుకున్నాయి