రేపటి నుండి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అమరావతి రాజధాని రద్దు చేసి,విశాఖకు రాజధాని తరలించేందుకు ఒక వైపు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూండటం, మరొక వైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని మరొక వైపు తెలుగుదేశంలో బిజెపి, జనసే, సిపిఐ వంటి పార్టీలు ఆందోళన చేస్తున్నపుడు అమరావతిలో కనివిని ఎరుగని ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. వెలగపూడి, మందడం తదితర ప్రాంతాలలో సుమారు 5 వేల మందిపోలీసును దించారు.
రాజధాని బాధితుల జెఎసి ,మరి కొన్ని రాజకీయ పార్టీలు. ఛలో అసెంబ్లీ కి పిలుపు నిచ్చాయి. ఛలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలు. విధించారు. శాంతి భద్రతలు పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించగలరని పోలీస్ వారు విజ్ఞప్తి చేశారు.
రేపటి కేబినెట్ అసెంబ్లీ సమావేశాలకు ముఖ్యమంత్రి వెళ్లేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆయన కాన్వాయ్ అసెంబ్లీ చేరుకునేందుకు ఒక ట్రైల్ రన్ నిర్వహించారు. ముఖ్యమంత్రి నివాసం నుంచి సచివాలయం వరకు అడుగడుగునా భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. కీలకమైన పాయింట్లలో మూడంచెల భద్రత వ్యవస్థ ఏర్పాటు చేశారు. దారి పొడవునా సమస్యాత్మకమైన గ్రామాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
అసెంబ్లీకి వ్యక్తి గత పనుల పైన వెళ్లే వారు ప్రత్నమాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీస్ వారి సూచన. అసెంబ్లీ పరిసర ప్రాంతాల వైపు వెళ్లే సామాన్య ప్రజలు పలు జాగ్రతలు పాటించవలసిందిగా పోలీసుల విజ్ఞప్తి చేశారు.
ఏపీ అసెంబ్లీ చుట్టూ మూడంచెల భద్రత వలయం ఏర్పాటయింది.రేపు ఏమవుతుందో చూడాలి.