బ్యాంకు కార్డులను యూజర్లు అవసరం లేనపుడు స్విచ్ ఆఫ్ చేసుకునేందుకు, పనిపడినపుడు స్విచ్ ఆన్ చేసుకునే వసతి కల్పించాలని బ్యాంకులన్నింటికి రిజర్వు బ్యాంకు అదేశాలిచ్చింది.
క్రెడిట్ , డిబిట్ కార్డులకు మరింత సెక్యూరిటీ కల్పించేందుకు రిజర్వు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది.
అంతేకాదు, బ్యాంకు నిర్ణయించిన ట్రాన్సాక్షన్ పరిమితిలోపే దేశీయంగా, అంతర్జాతీయంగా డబ్బు వినియోగానికి సొంతంగా ఒక పరిమితి విధించుకుని ట్రాన్సాక్షన్లు నిర్వహించుకునే వీలు కల్పించాలని కార్డులు జారీ చేసేసంస్థలకు ఆర్ బిఐ సూచనలిచ్చింది.
కార్డు హోల్డర్ స్వయంగా కార్డు ఇచ్చి చేసే ట్రాన్సాక్షన్లు అంటే పిఒఎస్, ఎటిఎమ్ లో మాత్రమే కార్డులు స్విచ్ ఆన్ అయి ఉండాలని, మిగతా సమయంలో అవి స్విచ్ ఆఫ్ అయిఉండాలని బ్యాంకు సూచించింది. రిజర్వు బ్యాంకు తాజా అదేశాల ప్రకారం కార్డు జారీ చేసిన వెంటనే కార్దును స్విచ్ ఆఫ్ చేసుకునేందుకు, స్విచ్ ఆన్ చేసుకునేందుకు వసతి కూడా అందించాల్సి ఉంటుంది. ఈ నియమాలన్నీ 2020 మార్చి 16 నుంచి అమలులోకి వస్తాయి.