బంగారు కొనేవాళ్లకు భరోసా, ఇకనుంచి నగల మీద హాల్ మార్క్ తప్పనిసరి

బంగారు కొనుగోళ్లలో ఎవరూ మోసపోకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్ మార్క్ (Hallmark)ను తప్పనిసరి చేసింది.
ఇది తక్షణం అమలులోకి వచ్చింది. హాల్ మార్క్ అనేది గోల్డ్ స్వచ్ఛతకు సర్టిఫికేట్. ఇది ప్రభుత్వం కొనుగోలుదారులకు కల్పించే భద్రత. హాల్ మార్క్ గుర్తు వేసేది బిఐఎస్ ఏజంట్లే అయినా, ఇది తప్పని సరికాదు. ఆసక్తి వున్నవాళ్లు స్వచ్ఛందంగా తాము విక్రయించే నగల మీద హాల్ మార్క్ వేయించుకోవచ్చు.
నగల మీద హాల్ మార్కు ముద్ర వేయించుకేనే విధానం 2000 నుంచే అమలులోకి వచ్చింది. ఇపుడు కేవలం 40 శాతం నగలు మాత్రమే హాల్ మార్కింగ్ తో వస్తున్నాయి. అయితే, బంగారు స్వచ్ఛత గురించి ఫిర్యాదులొస్తూ ఉండటంతో ఇపుడు హాల్ మార్క్ ను కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కచ్చితం చేసింది.
బంగారు వ్యాపారులంతా ఇపుడు తప్పనిసరిగా హాల్ మార్కింగ్ ఉన్న విక్రయించాలి. అంతేకాదు, వారంతా బిఐఎస్ లో తన దుకాణాన్ని నమోదు చేసుకోవాలి.ఇలా నమోదు చేసుకునేందుకు ఒక ఏడాది గడువు ఇస్తున్నారు. 2021 జనవరి 15 నుంచి దేశంలో ఏ వర్తకుడు హాల్ మార్క్ లేని నగలను మార్కెట్లో విక్రయించరాదని భారత కన్స్యూమర్స్ ఎఫైర్స్ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో పది గ్రేడుల బంగారు లభిస్తూ ఉంది. ఇకనుంచి మూడురకాల అంటే, 14 క్యారెట్ల, 18క్యారెట్ల , 22 క్యారట్ల బంగారాని మాత్రమే హాల్ మార్కింగ్ వేస్తారు. మిగతా వెరైటీ ల బంగారం విషయంలో ప్రభుత్వానికి సబంధంలేదు.
ఇది కూడా చూడండి:

https://trendingtelugunews.com/uncategorized/hallmarking-of-gold-in-india/

హాల్ మార్కింగ్ నియమాన్ని ఉలంఘిస్తే వర్తకుల మీద లక్ష రుపాయలు లేదా ఐదు రెట్ల అభరణం ధర ఫైన్ గా విధిస్తారు. హాల్ మార్కింగ్ నియమం వినియోగదారు విక్రయ లకు వర్తించదు. తమ దగ్గిర ఉన్న నగలను వారు స్వేచ్ఛంగా విక్రయించుకోవచ్చు. హాల్ మార్కింగ్ ను తప్పనిసి చేస్తున్నందున హాల్ మార్కింగ్ ఎజన్సీలను బాగా విస్తరింపచేస్తారు.ప్రస్తతందేశంలో 234 జిల్లాలలో 892 హాల్ మార్కింగ్, అసేయింగ్ సెంటర్లు పనిచేస్తున్నాయి. 2021 లోపు దేశంలోని 732 జిల్లాలలో ఒక్కొక్క హాల్ మార్కింగ్ , అసేయింగ్ సెంటర్ ను ఏర్పాటుచేస్తారు.
ఇది కూడా చదవండి 

https://trendingtelugunews.com/english/features/17-interesting-facts-about-gold-gold-facts-world-gold-council/

ప్రపంచంలో బంగారును భారీ దిగుమతి చేసుకునే దేశం భారతదేశమే. ప్రతిఏటా 700 నుంచి 800 టన్నుల గోల్డ్ దాకా భారతదేశంలోకి దిగుమతి అవుతుంది.
దేశంలో చిన్నా పెద్దా కలిపి సుమారు 4 లక్షల మంది బంగారు వర్తకులున్నారు. వీరిలో కేవలం 28,849 మంది మాత్రమే బిఐఎస్ లో తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. హాల్ మార్కింగ్ చేయించుకోవాలంటే ఒక నగకు రు.150 ఖర్చవుతాయి. అపుడు వారు బిఐఎస్ మార్క్ తో,పాటు స్వచ్ఛత నెంబర్, లోగో ముద్రవేస్తారు.
ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/english/features/why-russia-stockpiling-gold-to-break-free-from-us-dollar/