రాయలసీమ కాన్సెప్ట్ తో సంక్రాంతి ముగ్గుల పోటి

రాయలసీమ సాంస్కృతికోద్యమంలో భాగంగా 2017 సంక్రాంతి నుండి రాయలసీమ థీమ్ ముగ్గులను ఇళ్లముందు చిత్రించాలని రాయలసీమ సాంస్కృతిక వేదిక కోరింది. అనేక సీమ ప్రజా సంఘాలు ఇందులో భాగస్వామ్యమై గత మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి.
రాయలసీమ ప్రాంత దృష్ట్యా ఒక చారిత్రక సందర్భంలో సంక్రాంతి-2020 జరగబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం పాలన – అభివృద్ధి వికేంద్రీకరణ చేపట్టింది. వివిధ కమిటీల నివేదికలను హైపవర్ మంత్రుల కమిటి పరిశీలిస్తుంది. ఈ నెల 18 మంత్రి మండలి , 20 న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి వికేంద్రీకరణ పై ఒక నిర్ణయం వెలువరిస్తారని తెలుస్తుంది.
ఈ చారిత్రక నేపథ్యంలో రాయలసీమ వాసుల ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తెలియచేయడానికి, సీమ‌ ప్రజలు ప్రధానంగా మహిళలు, పిల్లలలో చైతన్యం తీసుకొని రావడానికి రాయలసీమ కాన్సెప్ట్ సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించలనుకొన్నాం.
శ్రీ భాగ్ ఒప్పందం అమలు, సీమలో హైకోర్టుతో పాటు సెక్రటేరియట్, అసెంబ్లీ కేంద్రం సేవలు, ఒక కీలక నగరం అభివృద్ధి, సంస్థలు- పరిశ్రమల ఏర్పాటు, నూతన అభివృద్ధి ఆలోచనలు, సాగు – త్రాగునీటి నికర జలాలు, సీమ భాషా ,సాహిత్య , చారిత్రక, సాంస్కృతిక ఔన్నత్యం- పరిరక్షణ ఇలా వైవిధ్యంగా సీమ ముగ్గులను ఇళ్లముందు చిత్రించాలని కోరుతున్నాం.

# సంక్రాంతి-2020 సందర్భంగా ఇళ్ళ ముందు సీమ నేపథ్యంగా చిత్రించిన స్పష్టమైన ముగ్గు ఫోటో ఒకటి 17 జనవరి సాయంత్రం లోపు -99639 17187- నెంబరు కు వాట్సప్ ద్వారా పంపాలి.

# నిపుణులచే ఎంపిక చేయబడిన ముగ్గులకు మొదటి, రెండవ, మూడవ బహుమతులు ఇస్తాం. మరికొన్ని ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని నిర్ణయించాం.
# పోటీలలో భాగంగా వచ్చిన ముగ్గులతో వీడియో డాక్యుమెంటరీ , ముగ్గుల చిత్రాలతో పుస్తకం కూడా తీసుకరావాలని ఆలోచిస్తున్నాం.
సీమ వాసులు ఉజ్వల భవితకై ఒక ముగ్గుతో మన ఆకాంక్షలను తెలియచేసి రాయలసీమ సాంస్కృతికోద్యమంలో భాగస్వామ్యులు కావాలని కోరుతున్నాం.
చివరి తేది: 17 జనవరి
ముగ్గులఫోటోలను పంపవలసిన నెంబర్: 99639 17187-.
రాయలసీమ సాంస్కృతిక వేదిక
రాయలసీమ సాంస్కృతిక వేదిక
(రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక),
రాయలసీమ.