భారత దేశంలో అత్యంత వివాదాస్పద వార్తల కెక్కిన వైస్ చాన్సలర్ ఎవరంటే న్యూఢిల్లీలోని జవహవర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జె ఎన్ యు) వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ ఎం జగదేష్ కుమార్.
దేశంలో ప్రతిష్టాత్మక ఒక విశ్వవిద్యాలయానికి విసిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన జాతీయ, అంతర్జాతీయ వార్త అయ్యారు.
బిజెపి అనుకూల వర్గం ఆయనను కీర్తిస్తుంటే, మరొక వర్గం ఆయనను విసిపదవి నుంచి తొలిగించి క్యాంపస్ లో హింసకు కారణమయినందుకు ఆయనమీద విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉంది.
ప్రధానిమోదీ, హోమ్ మంత్రి అమిత్ షాలాగా మూడేళ్లుగా ఆయన హెడ్ లైన్ కాని రోజు లేదు. ఇంతకీ ఆయననెవరో తెలుసా?
తెలుగు వాడు.తెలంగాణ వాడు. పూర్తి పేరు మామిడాల జగదేశష్ కుమార్. వామపక్ష భావాల సోషల్ సైన్స్ యూనివర్శిటీ అయిన జెఎన్ యును ఆయన బిజెపి ఐడియాలజీకేంద్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శ ఎదుర్కొంటున్న వ్యక్తి. మొత్తానికి ఆయన విసి కావడంతో క్యాంపస్ రైట్-లెఫ్ట్ సైద్ధాంతిక యుద్ధభూమి అయిందనేది మాత్రం నిజం. ఆయన ఈ పదవిలో ఇంకా ఏడాది ఉంటారు.
ఆయన విసిఉన్నపుడే జెఎన్ యు గతంలో ఎపుడూ వినని వివాదాలకు కేంద్రం మయింది. భారతదేశంలో ఎక్కువ మంది ఐఎస్ ఎస్ అధికారులను, అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న అధ్యాపకులను అందించిన విశ్వవిద్యాలయంగా జెఎన్ యుకు పేరుంది. అయితే, దేశరాజకీయాలో బిజెపి పెద్ధ శక్తిగా మారగానే జెఎన్ యు లో రగడలు మొదలయ్యాయి.ఇవన్నీ జరుగుతున్నపుడు వైస్ చాన్స్ లర్ గా ఉన్న వ్యక్తి ప్రొఫెసర్ జగదేష్ కుమార్.
ప్రొఫెసర్ జగదేష్ కుమార్ తెలంగాణకు నల్గొండ జిల్లాకు చెందిన వాడు. ఆయన తిరుమలగిరి మండలంలోని మామిడాల గ్రామానికి చెందిన వాడు. ఈగ్రామం నుంచి ఇద్దరు శాస్త్రవేత్తలు వచ్చారు.ఒకరు జగదీష్ కుమార్ ఎలెక్రానిక్స్ లో పరిశోధనచేశారు. ఎలెక్ట్రానిక్ డివైసెస్ రంగంలో ఆయన బాగా పేరున్న శాస్త్రవేత్త. రెండవ వ్యక్తి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య. జానయ్య హైదరాబాద్ అగ్రికల్చర్ యూనివర్శిటీ లో ప్రొఫెసర్ . ఆయన వరి మీద పరిశోదనలు చేశారు.కొద్దిరోజులు ఫిలిప్పీన్స్ లోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ లో కూడా పనిచేశారు. జానయ్య కూడా వైస్ చాన్స్ లర్ కావలసిన ఉన్నా, రాజకీయంగా బలం లేదు. ప్రొఫెసర్ మామిడాల జగదేష్ కుమార్ కు చాలా రాజకీయ బలం ఉంది.ఆయన ఆర్ ఎస్ ఎస్ కు సన్నిహితుడని పేరు. ఆయన వెనక బిజెపి ఉందని చెబుతారు.
2016 జనవరిలో ఆయన జెఎన్ యు వైస్ చాన్స్ లర్ గా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన ఢిల్లీ ఐఐటిలో ప్రొపెసర్ గా ఉన్నారు. అక్కడ ఆయన NXP Philips Chair Professor గా పనిచేస్తున్నారు. 2013లోఆయనకు క్లాస్ క్యాటగరిలో ఎక్సెలెన్స్ అవార్డు లభించింది.మంచి టీచర్ గా ఆయనకు గుర్తింపు వుంది. చాలా సింపుల్ గా ఉంటారు. ఆడంబరాలుండవు. అయితే, జెఎన్ యు ని బిజెపి, ఆర్ ఎస్ ఎష్ వైపు మళ్లించేందుకు ఆయన చాలా నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారని, ఈ విశ్వవిద్యాలయానికి ఉన్న విశిష్ట నియమాాలను పాటించడంలేదని, దీనికి కేంద్ర మావనవనరుల శాఖ మద్దతు ఉండటమే కారణమనే విమర్శ ఉంది.
ఆయన విసిగా రావడానికి ముందే మీడియా ఆర్ ఎస్ ఎస్ తో సంబంధాలున్న ప్రొఫెసర్ వైఎస్ చాన్స్ లర్ కాబోతున్నారని రాసింది. ఆయన నియామానికి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు.
తాను కరాటే ఎక్స్ పర్ట్ నని రెగ్యలర్ గా షిటో ర్యూ కరాటే అభ్యాసం చేస్తానని ఆయన తన బ్లాగ్ లో రాసుకున్నారు.
ఆయన మద్రాస్ ఐఐటి నుంచి పిహెచ్ డి తీసుకున్నారు.పోస్ట డాక్టొరల్ కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయంలోచేశారు.
ఆయన 2016లో వైఎస్ చాన్స్ లర్ అయినప్పటినుంచి జెఎన్ యు లో ఆర్ ఎస్ ఎస్ అజండాను అమలుచేస్తున్నారనే విమర్శ వచ్చింది. దీనికోసమే ఆయనను విసి గా తీసుకువచ్చారని చెబుతారు. యూనివర్శటీలో దేశ ద్రోహ నేరం వివాదంతో ఆయన వివాదాలపరంపంర మొదలయింది.
యూనివర్శిటీ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ తదితరుల మీద ఈకేసు మోపడం, అది వివాదం కావడం తెలిసిందే. ఆయన బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజుల్లోనే విద్యార్తులు అప్జల్ గుర్ ఉరిశిక్ష ను వ్యతిరేకిస్తూ ఒక చర్చ జరపాలనుకున్నారు.దీనికి ఆయన అనుమతినీయాలేదు. దీనితో వివాదం మొదలయింది. ఒకనిరసన ప్రదర్శనలో కొంతమంది విద్యార్థులు దేశ వ్యతిరేక నినాదాలు చేశారనే ఆరోపణ మీద దేశద్రోహ నేరం మోపారు. ఈ వివాదం చాలా రోజులు సాగింది.
తర్వాత ఒక సారి ఆర్ ఎస్ ఎస్ అను బంధంగా పనిచేసే ఎబివిపికి , విద్యార్థులకు మధ్య జరిగిన గొడవ తర్వాత నజీబ్ అహ్మద్ అనే విద్యార్థి మాయమయ్యాడు.
నవంబర్ 2017లో ఆయన విశ్వవిద్యాలయంలో ధర్నాలను నిషేధించారు. ఆయన ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ ను విశ్వవిద్యాలయానికి ఆహ్వనించి జవహర్ లాల్ నెహ్రూ మెమోరియల్ ఉపన్యాసం ఇప్పించారు.
ఆయన తొలినుంచి దేశ భక్తి ని ప్రభోదిస్తున్నారు.2018 జూలై కార్గిల్ విజయోత్సవాన్ని నిర్వహించారు. అపుడు ప్రసంగిస్తూ జెఎన్ యు విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందించేందుకు కాంపస్ లో ఒక కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ట్యాంకును ప్రతిష్టించాలనుకున్నట్లు ప్రకటించి మరొక సంచలనం సృష్టించారు.
2019లో తన భార్యను విద్యార్థులు గృహనిర్బంధంలో ఉంచారని ఫిర్యాదు చేశారు. విద్యార్థుల వందల సంఖ్యలో తన నివాసం మీద దాడిచేశారని ఫిర్యాదు చేశారు.
ఇపుడు తాజాగా కొంతమంది మాస్కులు ధరించిన వ్యక్తులు యూనివర్శిటీలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. అనేక మంది గాయాలయ్యాయి. మాస్కులు ధరించిన వాళ్లు ఎబివిపి విద్యార్థులని కొన్ని పత్రికలు రాశాయి.
తాజా వివాదం
కాంగ్రెస్ నియమించిన నిజనిర్ధారణ కమిటీ ఈ గొడవల వెనక వైస్ చాన్స్ లర్ జగదేష్ కుమార్ హస్తముంది అని వెల్లడించింది. ఆయననను వెంటనే వైస్ చాన్స్ లర్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది.కాంగ్రెస్ నియమించిన నలుగురు సభ్యలు నిజనిర్ధారణ కమిటీకి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మితా దేవి అధ్యకురాలు. ఆదివారంనాడు తమ విచారణ వివరాలను మీడియాకు చెబుతూ వైఎస్ చాన్స్ లర్ జగదేష్ కుమార్ ఈ హింస వెనక సూత్రధారి అని, ఆయన చర్యల మీద ప్రత్యేక క్రిమినల్ ఎంక్వయిరీ జరపాలని డిమాండ్ చేశారు.
‘వైస్ చాన్స్ లర్ జగదేష్ కుమార్ ను వెంటనే డిస్మిస్ చేయాలి. 2016 జనవరి 27న విసి బాధ్యతలు స్వీకరించిన ప్పటి నుంచి ఇప్పటిదాకా యూనివర్శిటీలో జరిగిన గొడవల్లో ఆయన హస్తం మీద ప్రత్యేక విచారణ జరగాలి. అదే విధంగా ఆయన తీసుకున్న పలు పాలనాసంబంధ, ఆర్థికనిర్ణయాల మీద కూడా విచారణ జరగాలి,’ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నిజనిర్ధారణ కమిటీలో రాజ్యసభ సభ్యుడు సయ్యద్ నజీర్ హుసేన్, లోక్ సభ సభ్యుడు హిబిఈడెన్, మాజీ ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రెశిడెంట్ అమృతా ధవన్ ఉన్నారు.