నిన్న మందడంలో పోలీసుల దాడిలో గాయపడిన శ్రీ లక్ష్మీ ని ఆయుష్ హాస్పిటల్ లో మాజీ ముఖ్యమంత్రి,తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఈరోజు పరామర్శించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మొండిగా పోయి, విలన్లు కావద్దని ఆయనపోలీసులకు సలహా ఇచ్చారు. ’ఇది మన రాష్ట్రం, మన భవిష్యత్తు,మన రాజధాని అనే విషయాన్ని వాళ్లు (పోలీసులు)కూడా గుర్తంచుకోవాలి,’ అని అన్నారు.
రాజధాని కోసం ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, శ్రీలక్ష్మి అనే మహిళపై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన వర్ణించారు. పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక్కొక్క సారి మానవత్వం ఉన్న వాళ్లు కూడా ఉద్యోగం కోసం ఇలా చేయాల్సి వస్తుంది. పోలీసులు బాస్ చెప్పినట్లు, డిజిపి చెప్పినట్లు ప్రవర్తిస్తే పోలీసులను చరిత్రక్షమించదు. ఉద్యోగమని ఇష్టానుసారం ప్రవర్తించరాదు. ఈ ఉద్యోగం పోతే మరొక ఉద్యోగం వస్తుంది. కాని ఈరాజధాని పోతే, మరొక రాజధాని రాదు అని ఆయన పోలీసులకు సలహా ఇచ్చారు.
‘పోలీసులు కూడా మానవత్వంతో ఆలోచించాలి అని కోరారు.
జాతీయ మహిళా కమిషన్ సభ్యులు ఈ మహిళ దగ్గరకు వచ్చి నిన్న జరిగిన ఘటనపై విచారణ చేయాలి. ఆమె ఏమి చెబుతుందో వారు కూడా తెలుసుకోవాలి. 144 సెక్షన్ పెట్టి కర్ఫ్యూ వాతావరణం సృష్టిస్తున్నారు.రాజధాని ప్రాంతంలో పోలీసులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు,’ అని ఆయన అన్నారు.