రాజా చారి ఈ పేరు గుర్తుంచుకోండి. ఇంకా బాగా చెప్పాలంటే విర్పూత్తూరు రాజా చారి. ఈ పేరు చరిత్రలో నిలవబోతున్నది. ఎందుకంటే అమెరికా యాస్ట్రొనట్ శిక్షణ పొంది, చంద్రుని మీదకు వెళ్లున్న యువకుల్లో రాజా చారి ఒకరు. ఏమో ఎవరుచూశారు. 2028లో అమెరికా అంగారకుడి మీద కూడా మనుషుల్ని పంపాలనుకుంటున్నది. ఆచాన్సయినా భారతీయ సంతతికి చెందిన చారి కి రావచ్చు. రాజా చారి హైదరాబాదీ.
రాజాచారి తండ్రి శ్రీనివాస్ చారి. హైదరాబాదీ. అమెరికా లో స్థిరపడ్డారు. 2017లో రాజా చారి నాసా యాస్ట్రొనట్ క్యాండిడేట్ క్లాస్ కు ఎంపికయ్యారు. ఆ యేడాది ఆగస్టు నుంచి ఈ క్లాసులకు హాజరవుతున్నారు. 1999లో ఆయన యుఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడె మీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత ఏరోనాటిక్స్ అండ్ యాస్ట్రొనాటిక్స్ పిజి చేశారు. తర్వాత యుఎస్ నేవల్ టెస్ట్ పైలట్ కోర్సుకూడా చేశారు. ఆయనకు వివాహమయింది. భార్య పేరు హాలీ స్కాప్టర్ చారి. వారికి ముగ్గురు సంతానం. తల్లి పేరు పెగ్గీచారి, అయోవాలోని సెడార్ ఫాల్స్ లో నివాసముంటున్నారు. తండ్రి 2010 ఏప్రిల్ లోచనిపోయారు.
శ్రీనివాస్ చారిది మహబూబ్ నగర్. ఆయన తండ్రి అంటే రాజాచారి తాత ఉస్మానియాలో మ్యాథమేటిక్స్ ప్రొఫెసర్.అయితే, 1955లో శ్రీనివాస్ 13 సంవత్సరాల వయసపుడే చనిపోయారు.ఆయనను తల్లే పెంచి పెద్ద చేసింది. తర్వాత శ్రీనివాస్ కూడా ఉస్మానియాలొ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు.1970లో అమెరికా వెళ్లారు. విస్కాన్ సిన్ లో చదవుతున్నపుడు యూనివర్శిటీ కార్డియాక్ విభాగంలో నర్స్ గా ఉన్న పెగ్గీ తో పరిచయమయింది. తర్వాత పెళ్లి చేసుకున్నారు.రాజా చారి 1977జూన్ 25 న జన్మించాడు. శ్రీనివాస్ చారికి ట్రాక్టర్లు తదితర వ్యవసాయ పరికరాలుచేసే జాన్ డీన్ (John Deere)లో ఉద్యోగం వచ్చింది.
హూస్టన్ లోని జాన్ హాప్కిన్స్ సెంటర్ లో కఠోర శిక్షణ తర్వాత 11 సిల్వర్ పిన్స్ అందుకు న్న పదకొండు మంది యాస్ట్రోనాట్స్ కు చారి ఎంపికయ్యాడు. నాసా సంప్రదాయం ప్రకారం సిల్వర్ పిన్స్ పొందిన వాళ్లకే ఆంతరిక్షంలోకి వెళ్లే అర్హత ఉంటుంది. ఒక సారి అంతరిక్షంలో కి వెళ్లాక ఈ సిల్వర్ పిన్స్ పోయి గోల్డెన్ పిన్స వస్తాయి.
ఇలా అంతరిక్షంలోకి ఎగిరే అవకాశం దక్కించుకున్న భారతీయ సంతతి వారిలో చారి మూడవ వ్యక్తి. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ మిగతా ఇద్దరు. 2024లో అమెరికా యాస్ట్రోనట్సో చంద్రుని మీదకు వెళ్లే అవకాశం ఉంది. 2014లో ఒక పురుషుడిని, ఒక మహిళలను చంద్రుని మీదకుపంపాలని ఆమెరికా భావిస్తున్నది. ఇదే విధంగా 2028నాటికి అంగారకుడి మీదకు కూడా పంపేందుకు అసవరమయిన బేస్ ను చంద్రుని మీద తయారుచేసేందుకు 2024 చంద్రమండలయాత్ర జరుపుతున్నారు.