భారత దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ.అందునా తెలుగు రాష్ట్రాలలో చాలా ఎక్కువ. పంట చేతికి అందక, చేతికి అందిన పంటకు సరైన ధర రాక, కరువులు, వరదలు, ప్రభుత్వ విధానాలు, మధ్యవర్తులు… ఇలా రైతులును దెబ్బతీస్తున్న శక్తులు ఎన్నో వున్నాయి. వీటిని తట్టుకోలేక, రుణాలు తీర్చలేక చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
ఈ వార్త బాగా హైలైట్ అవుతుంది. ఎందుకంటే రైతుల పేరు చెప్పి రాజకీయం చేసేందుకు ఈ వార్త బాగా పనికొస్తుంది.
అయితే, ట్రాజెడీ ఏమంటే, రైతులకంటే పెద్ద సంఖ్యలో ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్లు నిరుద్యోగులు. చదువుల సరిగ్గా లేక, చదువులు సరిపోకా, పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకోలేక, ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్ మెంట్ వస్తాయో రాదో తెలియక, సంక్షోభం లో పడిపోతున్న వాళ్లు నిరుద్యోగులు, ఎపుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియక లక్షలాది మంది నిరుద్యోగులు సంవ్సరాలుగా ఎదరుచూస్తుంటారు. పోటీ పరీక్షలు రాస్తే ఫలితాలొస్తాయన్న గ్యారంటీ లేదు. ఫలితాలొస్తే వెంటనే ఉద్యోగాలొస్తాయన్న గ్యారంటీ లేదు. తెలుగు రాష్ట్రాలలోనయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల ప్రాసెస్ ఎపుడూ ఒకటి రెండేళ్లో పూర్తి కానేకాదు.ఈ నేపథ్యంలో భారతదేశంలో ఆత్మహత్య చేసుకుంటున్న నిరుద్యోగుల వివరాలను నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా(NCBI) వెల్లడించింది.
NCBI వివరాల ప్రకారం 2018లో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య ఆత్మహత్య చేసుకున్న రైతులకంటే ఎక్కువ. దేశంలోని మొత్తం ఆత్మహత్యలలో 12,936 ఆత్మహత్యలు(9.6)శాతం నిరుద్యోగులవే. రైతుల ఆత్మహత్యలు (10,349మంది) 7.7 శాతమే.