దేశ ద్రోహ అభియోగంతో పాటు ఎన్నో కేసులు ఎదుర్కొంటున్న సిపిఐ జాతీయ కార్య వర్గ సభ్యుడు కన్నయ్య కుమార్ పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అర్హత లేదని బీజేపీ విజయవాడ పార్లమెంట్ కన్వీనర్ కిలారు దిలీప్ వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ బీహార్ లోని ఒక నియోజకవర్గం లో పోటీ చేసి ప్రజల తిరస్కారానికి గురైన కన్నయ్య కుమార్ CAA గురించి ఎలా మాట్లాడతారని అన్నారు. కన్నయ్య ప్రసంగాన్నిబాధ్యత గత మీడియా పూర్తిగా బహిష్కారించాలి.
‘ మతపరంగా వేధింపులకు గురయి పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ లనుంచి భారత్ కు వచ్చే క్రైస్తవ, జైన, పార్శీ,బైౌద్ధ, హిందు, పంజాబి మైనారిటీ వర్గాలకు పౌరసత్వం కల్పించడమే CAA బిల్లు ముఖ్య ఉద్దేశం. ఇది ఎవరికి ఇబ్బంది కాదు.ఇందులో ఇంతకు మించి ఏముంది,’ అని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ ప్రభుత్యం ఎవరికి వ్యతిరేకం కాదు అన్ని సామాజిక వర్గాలకు తాము సమన్యాయం చేస్తున్నామని దిలీప్ అన్నారు.
CAA బిల్లు కు సపోర్ట్ చేసే వాళ్ళు 8866288662 మిస్డ్ కాల్ ఇస్తే నేరుగా ప్రధాని ఛేంబర్కు చేరుతుందని ఆయన చెప్పారు.
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని,అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా రాజధాని మహిళలను వెళ్లనీయకుండా పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం సరికాదు. రాజధానిగా తాము అమరావతికే మద్దతు తెలియజేస్తున్నామని దిలీప్ స్పష్టం చేశారు.
నిద్రపోతున్నట్లుగా వైసీపీ పాలకులు నటించకుండా నిద్ర లేచి ప్రజలకు ఆంక్షలకు అనుగుణంగా నడుచుకుంటే మంచిదని ఆయన విమర్శించారు.
దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు సిబిఐ కోర్టుకు హాజరు కాలేదు. ఆ ఘనత మన జగన్ కే దక్కుతుందని, ఆయన నైతికంగా ఆ పదవిలో కొనసాగడం ఎలా సాధ్యం అని దిలీప్ ప్రశ్నించారు.