చాలా రోజుల తర్వాత రైల్వే శాఖకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. రాబడి పెందచునేందుకు రైలు బోగీలను వినియోగించుకోవాలనుకుంటున్నది. రైలు ఇంజిన్ మొదలుకుని బోగుల దాకా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వాణిజ్య ప్రకటనలను అనుమతించి నాన్ ఫేర్ (non-fare) రాబడి పెంచుకోవాలనుకుంటున్నది.
ఈ విషయాన్ని రైల్వేమంత్రీ పీయూష్ గోయల్ ట్విట్టర్ ప్రకటించారు. వాణిజ్య ప్రకటనలున్న లోకోమోటివ్ ఫోటోలను కూడా ఆయన షేర్ చేశారు. నిజానికి ఈ పని ఎపుడో చేయావలసి ఉండింది. రైల్వేలు కష్టాల్లో ఉన్నపుడు గతంలో ఒక్క రైల్వే మంత్రికి కూడా ఈ ఆలోచన రాలేదు.ఆశ్చర్యం.
2017లో ఇలాంటి వార్తలొకసారి వచ్చాయి. అపుడు సౌత్ ఈస్టర్న్ రైల్వే ఈ ప్రయత్నం చేసిందని, అపుడు గూడ్సుల మీద ప్రకటనలు వేసేందుకు దాల్మియా సిమెంట్ కాంట్రాక్ట్ తీసుకుందని మీడియాలో వార్తలొచ్చాయి. తర్వాత ఈ విధానం విస్తరించలేదు.
నాన్ ఫేర్ రెవిన్యూ పెంచుకునే ఆలోచనల సురేష్ ప్రభు రైల్వే మంత్రిగా ఉన్నపుడు 2016 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. అయితే, అది అంతవేగంగా కార్యరూపం దాల్చలేదు.
ఇపుడు ఈ విధంగా రాబడి పెంచుకుని వచ్చిన ఆదాయంతో ప్రయాణికులకు వరల్డ్ క్లాస్ సేలవందిస్తామని మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.
In a novel initiative to increase revenue, Railways has permitted the physical branding of locomotives.
Through this initiative, railways will ensure additional revenue for providing world class passenger services. pic.twitter.com/bD0u7WIU1F
— Piyush Goyal (@PiyushGoyal) January 10, 2020