అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రికత్త తగ్గినసూచనలు కనిపించగానే కొండెక్కిన బంగారు ధరల జరజర కిందికి జారింది. ఈ రోజు పది గ్రాములమీద గత మూడు రోజుల్లో మొత్తంగా రు.1600 తగ్గింది.
గత వారంలో ఇరాన్ అమెరికా యుద్ధమేఘాల మధ్య ఇండియాలో బంగారు ధర అమాంతం పెరిగి రు. 41,293 లకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇరాక్ లోని అమెరికా సైనిక శిబిరాల మీద జననష్టం లేకుండా ఇరాన్ జరిపిన దాడితో అమెరికా ఒకడుగువెనకేసి శాంతిప్రవచానాలు వల్లించిన సంగతి తెలిసిందే. దీనితో ఇరాన్ కూడాతానూ ఒకడుగు వెనకేసి ఇప్పట్లో ఇక యుద్ధం జరిగే అవకాశంలేదన్న సంకేతాలు పంపింది.
ఇది అంతర్జాతీయ బంగారుమార్కెట్ మీద ప్రభావం చూపింది. అప్పటినుంచి ధరలు తగ్గడం మొదలయింది. ఈ రోజు వరసగా మూడో సారి ధరలు తగ్గాయి. మల్టి కమోడిటీ ఎక్సేంజ్ లో బంగారు ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధరలు 0.38 శాతం తగ్గి పదిగ్రాముల ధర రు.39,680 దిగిపోయింది.ఇక వెండి ధర 0.34 శాతం తగ్గి కిలో ధర రు. 46,419కి వచ్చింది.
దేశరాజధానిలో రు. 80తగ్గి పది గ్రాముల ధర 40,554 దిగింది. గురువారం నాడు ఇదే ధర రు. 40,634 పలికిన సంగతి తెలిసిందే. వెండి రు.200 తగ్గి కిలో 47,695 కు వచ్చింది. గురువారం నాడు ఇది రు. 47,895గా ఉండింది.
అంతర్జాతీయ మార్కెట్ లో బంగారు ధరలు పడిపోయాయి. బంగారు ఔన్స్ ధర 1,551 డాలర్లకు చేరుకుంది.