టీ హబ్ నాలుగో వార్షికోత్సవ సంబరాల్లో పాల్గొన్న ఐటి శాఖ మంత్రి కే తారకరామారావు టెక్నాలజీ రంగంలో 2020 సంవత్సరం తెలంగాణకు అత్యంత ప్రాధాన్యత కలిగిన సంవత్సరం అని అన్నారు.
ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
టెక్నాలజీ ఇన్నోవేషన్ ద్వారా అనేక సవాళ్లకు సమాధానాలు లభిస్తాయి. తెలంగాణ స్టార్టప్ కంపెనీలు ఈ దిశగా పని చేయాలి. జాతీయ అంతర్జాతీయ స్టార్ట్ అప్ మరియు ఇన్ఫర్మేషన్ ఈకో సిస్టంలో తెలంగాణకు అగ్రస్థానం లభించింది.
తెలంగాణ ప్రభుత్వానికి 2020 సంవత్సరం అత్యంత ప్రాధాన్యత కలిగిన సంవత్సరంగా ని లువనున్నది.ఇప్పటికే 2020 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంవత్సరం పొడుగున అనేక వినూత్నమైన కార్యక్రమాలను ఈ రంగంలో చేపట్టబోతున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీ రంగంలోనూ ముందువరుసలో నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుంది. 2020 సంవత్సరం లోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఇంకుబేటర్ టీ హబ్ 2, దేశంలోనే అతిపెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్ టీ- వర్క్స్ ని ప్రారంభించనున్నం.
నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీ హబ్ ఇన్నోవేషన్ రంగంలో తెలంగాణకు ప్రత్యేక స్థానాన్ని సాధించి పెట్టింది. కేవలం రాష్ట్రంలోనే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంది.గుర్తింపుతెచ్చుకుంది.
గత నాలుగు సంవత్సరాల్లో సాధించిన ప్రగతి సంతృప్తికరంగా ఉంది, రానున్న సంవత్సరాల్లో మరిన్ని మైలురాళ్లను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తుందన్న నమ్మకం నాకు ఉన్నది
ఇప్పటికే అనేక అంతర్జాతీయ స్థాయి భాగస్వాములతో ఇన్నోవేషన్, స్టార్టప్ రంగంలో ముందుకు పోతున్నది
ఇన్నోవేషన్ రంగంలో ముందు వరుసలో నిలవాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది
ఇన్నోవేషన్ రంగంలో ప్రగతి ద్వారా కేవలం కార్పొరేట్ సెక్టార్లో నే కాకుండా పారిశ్రామిక రంగంలోని అనేక సవాళ్లను కూడా ఎదుర్కొనే అవకాశం ఉన్నది. ఈ దిశగా తెలంగాణలోని యువత, స్టార్టప్ కంపెనీలు పనిచేయాలని కోరుకుంటున్నాను.
(హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలు టెక్నాలజీ దిగ్గజం కంపెనీల ప్రతినిధులు ఐటి మరియు ఐటి అనుబంధ పరిశ్రమల ప్రతినిధులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు)