పోలీసుల ఆదుపులో నారా లోకేష్, ఏమయినా రైతులతోనే ఉంటా: లోకేష్

అమరావతి: టీడీపీ ప్రధాన కార్యదర్శి,  ఎమ్మెల్సీ నారా లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించాలనన్న ప్రతిపాదనకు నిరసనగా విజయవాడలో  24 గంటల దీక్షలో ఉన్న  ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు పరామర్శించి తిరిగొస్తుండగా లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  కనకదుర్గమ్మ వారధి వద్ద లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ముందుకు పోకుండా నివారించారు.  రైతులు  చేస్తున్న  రాస్తారోకో వైపు ఆయన వెళ్తున్నాడని, అందుకే ఆయన్ను ముందుజాగ్రత్త చర్యగా అడ్డుకున్నామని పోలీసులు చెబుతున్నారు. తాను, రైతుల ఆందోళన దగ్గిరకు వెళ్లడం లేదని , తెలుగు దేశం పార్టీకార్యలయానికి  వెళ్తున్నానని చెప్పినప్పటికీ పోలీసులు వినలేదు. పోలీసులు  లోకేష్‌ అదుపులోకి తీసుకోవడం పట్ల ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నారా లోకేష్‌తో పాటు అదే వాహనంలో ప్రయాణిస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తొట్ల వల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం.


 
widgets.js” charset=”utf-8″>