రైల్వేలోని రకరకాల ఉద్యోగాలన్నింటికి ఒకే గూటికిందికి తెచ్చి ఏర్పాటుచేసిన ఇండియన్ రైల్వే మేనేజ్ మెంట్ సర్వీస్ (IRMS)కు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చే ఏడాది నుంచి రిక్రూట్ మెంట్ మొదలుపెడుతుంది. సివిల్స్ తో కలిపి కాకుండా ఇండియన్ రైల్వేస్ ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించబోతున్నారు. 2021లో ఈ పరీక్ష ఉంటుంది.
రైల్వేశాఖకు ఏ విభాగానికి ఎన్నిక ఉద్యోగాలు అవసరమనే సమాచాారాన్ని తొందర్లోనే యుపిఎస్ సి తెలియచేస్తామని రైల్వే అధికారులు చెప్పారు.సివిల్, ఎలెక్ట్రికల్, మేకానికల్, స్టోర్స్, ట్రాఫిక్, అకౌంట్స్,పర్సొనెల్ విభాగాలకు ఎంపిక జరుగుతుంది. అయితే, మెయిన్ పరీక్ష మాత్రం ఏ విభాగానికి చెందిన సబ్జక్టులో మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు అభ్యర్థి మెకానికల్ రంగం ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే IRMS మెయిన్ పరీక్ష మెకానికల్ ఇంజినీరింగ్ లో మాత్రమే రాయాల్సి ఉంటుంది.
దీనితో రైల్వేకి ఒకే సర్వీసు నుంచి అభ్యర్థులు అందుబాటులో ఉంటారు, ప్రమోషన్ అవకాశాలుకూడా సమానంగా ఉంటాయి.
ఇపుడుయుపిఎస్ సి వచ్చిన మార్కలు, పుట్టిన తేదీ ఆధారంగా డివిజినల్ రైల్వే మేనేజర్స్ గా ఎంపికయినవారికి మాత్రమే ఉన్నత స్థాయికి వెళ్లేఅవకాశం ఉంటున్నది. ఐఆర్ ఎమ్ ఎస్ తో ఈ విధానం ముగుస్తుంది. పనితీరు, అంకితభావం పట్టి మొత్తం బ్యాచ్ లో ఉన్న వారందరికి 15 సంవత్సరాల సర్వీస్ తో ప్రమోషనల్ అర్హత వస్తుంది. అంటే, స్పెషలైజేషన్ తో సంబంధం లేకుండా అందరికి అత్యున్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది.
https://trendingtelugunews.com/english/features/countries-where-more-than-half-of-population-speak-english/