అమెరికా- ఇరాన్ మధ్య వైరం పెరగడంతో పెట్రోలియం ధరల మీద పడిన సంగతితెలిసిందే. అయితే, ఈ దెబ్బకు రుపాయ విలువ బాగా పడిపోయిం. గత వారం నుంచి రుపాయి వణుకుతూనే ఉంది.
ఈ రోజు ఈ వార్త రాస్తున్నప్పటఇకి డాలర్ తో పోలిస్తే రుపాయ విలువు 72.08 రుపాయలయింది. గత వారం 72.01తో మొదలయింది. వారాంతానికి 71.80 కు చేరింది. ఇది రెన్నెళ్ల కిందటి ధర, ఇలా పడిపోవడంతో గత రెంండు ట్రేడింగ్ సెషన్స్ లో వచ్చిన ఆదాయాన్నంతా బుగ్గిపాలు చేసింది.
శుక్రవారం నాడు అమెరికా బాంబులు వేసి ఇరాన్ టాప్ మిలిటరీ జనరల్ కాసిమ్ సోలేమని ని మట్టు పెట్టాక ఏర్పడిన పెట్రోలియం సంక్షోభంలో 42 పైసలు పడిపోయి 71.80 కు చేరింది.
అమెరికా చర్యకు ప్రతీకారంగా అమెరికా స్థావరాలమీద ఇరాక్ కూడా ప్రతిదాడులు మొదలుపెట్టింది. దీనితో ముడి చమురు ధర బ్యారెల్ 70 డాలర్లకు పెరిగింది. ఈ రోజు బ్యారెల్ 70.61 డాలర్ల దగ్గిర ట్రేడవుతూ ఉంది.