రావిచెరువులో మత్తడి దూకిన గోదావరి జలాలు, ఊరంతా పండుగ

సూర్యపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్ పహాడ్ మండలం రావిచెరువు లో గోదావరి నీళ్లతో మత్తడి దూకింది.దీనిని చూసేందుకు మండలంలోని అనేక గ్రామాలనుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.గోదావరి జలాలకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుంటే కాళేశ్వరమే ఉండి ఉండేది కాదని సూర్యాపేట జిల్లా ప్రజలు వెయ్యి ఏండ్లు నిండినా గోదావరి జలాలను చూసి ఉండేవారం కాదని మంత్రి అన్నారు.
ఈరోజుతో  ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ నెరవేరి ఈ రోజు ఊరంతా పండుగ జరుపుకున్నామంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పబలమే నన్నారు.
ఉద్యమ సమయంలో ఇక్కడి ప్రజలు అటు మూసి నుండి కానీ ఇటు కృష్ణా జలాలను లిఫ్ట్ ల ద్వారాగాని పెన్పహాడ్ మండలానికి పారించాలన్న డిమాండ్ చేశారు.  క్రిందటి దీపావళి రోజున ఇదే మండలం చిన్న గారకుంటగ్రామంలో దీపావళి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో నూ వచ్చే దీపావళి నాటికి పెన్పహాడ్ మండలానికి గోదావరి జలాలు  అందిస్తామని చెప్పామని, ప్రకటించిన విదంగానే మొన్నటి దీపావళి కి ఇక్కడికి గోదావరి జలాలు చేరుకున్నాయని అది ముఖ్యమంత్రి కేసీఆర్ కృషే అని ఆయన కొనియాడారు.
చివరి అంగళం  వరకు గోదావరి జలాలు అందించాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని శతబ్దాల నిరీక్షణ అనంతరం రావిచెరువు గోదావరి నీటితో మత్తడి దూకిందన్న సంతోషం తో తెలంగాణ రైతు కండ్లలో కనిపించే ఆనందమే ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకున్నదని,అది యిలా నేరవేరినందుకు సంతోషం పట్టపగ్గాలు లేకుండా పోయిందని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.
.