అమరావతిలో తిరిగి వ్యవసాయం వర్దిల్లాలని, అమరావతి ప్రాంతాన్ని ప్రభుత్వం అగ్రికల్చర్ జోన్ గా ప్రకటిస్తే స్వాగతిస్తానని వెఎస్ ఆర్ కాంగ్రెస్ మంగళగిరి ఎంఎల్ ఏ ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
అమరావతి అగ్రికల్చర్ జోన్ కాావాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన అన్నారు. ఈ రోజు ఆయన తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. రైతుల పేరుతో చంద్రబాబు ఈ రోజు తాను ఇన్ సైడర్ ట్రేడింగ్ లో కొన్న భూములను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ఆయన తీవ్రమయిన ఆరోపణ చేశారు.
ఇదే విధంగా చంద్రబాబు నాయుడి భార్య భవనేశ్వరీ దేవీ రెండు రోజుల కింద రైతుల ఆందోళనకు మద్దతు తెలిపి బంగారుగాజులు విరాళంగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాజధానికి భూములు ఇవ్వాలని రైతులను పోలీసు స్టేషన్ల ల్లో పెట్టికొట్టినప్పుడు ఎందుకు రోడ్లు పైకి భువనేశ్వరి రాలేదని ఆయన ప్రశ్నించారు.
‘ ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు. వేల ఎకరాల భూములు తీసుకొని అమరావతిలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ ఎందుకు కట్టలేదని చంద్రబాబు ను భువనేశ్వరి అడగాలి,’ అని ఆళ్ల అన్నారు. భూములు ఇవ్వని రైతుల్ని చంద్రబాబు కొట్టించిన రోజున భువనేశ్వరి ఏమయ్యారు..? మూడు పంటలు పండే భూములు లాక్కున్నప్పుడు రైతులు ఆమకు గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు.