నిన్న పరమపదించిన ఉడుపి పెజావర్ మఠం విశ్వేష తీర్థ స్వామీజీ చాలా హిందూ ధర్మ విషయాల్లో సంస్కరణలు తీసుకువచ్చాడు. ఇందులో అన్యమతాల వారికి ఆలయ ప్రవేశం ప్రధానమయింది. ఇతర మతాల వారికి ఆలయ ప్రవేశం ఉండాలన్నది ఆయన వాదన. అందుకే ఆయన ముస్లింలను ఉడిపి శ్రీకృష్ణ ఆలయానికి రప్పించి రంజాన్ విందునిచ్చి, ఉపవాసరం ఉపసంహరించుకునేలా చేసి నమాజ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ విషయంలో ఆయన విమర్శలను ఖాతరు చేయలేదు.
ఆయన సంస్కరణల్లో మరొక ప్రధానాంశం, స్త్రీలు కూడా సన్యాసం స్వకరించవచ్చనేది. ఆయన దగ్గిర సన్యాసం స్వీకరించిన వారిలో ఒక ఒకనాటి కేంద్ర మంత్రి ఉమా భారతి ఒకరు. తనకు ఆధ్యాత్మిక గురువే కాదు, తండ్రి లాంటి వాడని ఉమాభారతి చెప్పుకునేవారు. స్వామీజీ శిష్యురాళ్లలో ఉమాభారతి మొదటి వారు. స్వామీజీ మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతన్నపుడు ఉమాభారతి ఆశ్రమంలోనే ఉండి ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేశారు.
ఉమాభారతికి గ్వాలియర్ రాజమాత 1987లో స్వామీజీని పరిచయం చేశారు. 1992లో స్వామీజీ ఆమె చేత సాధ్వి దీక్ష చేయించి సన్యాసాశ్రమంలోకి ఆహ్వానించారు.
హిందూ మతంలోని అతివాద, మితవాదాలతో కాకుండా తాను మధ్యే మార్గంలోొ పయనిస్తానని ఆయన చెప్పేవారు.