రాజధాని మీద వైసిపి తీరుపై తెలుగుదేశం చంద్రబాబు అధినేత ఆగ్రహం. మంగళగిరి పార్టీకార్యాలయంలో ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడారు.
అమరావతి పై రోజుకో మాట మాట్లాడుతున్నారు. తలోమాట మాట్లాడు తున్నారు. అంతా కలసి రాజధాని ని నాశనం చేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు ను అంధకారం లోకి నెడుతున్నారు. ప్రభుత్వ కుట్రలు గమనించాలని 5కోట్ల ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాను.
అమరావతి ఎప్పటికీ ప్రజా రాజాధానే. రాజధాని కి లక్ష కోట్లు కావాలి అంటున్న మంత్రులకు సంపద సృష్టిపై అవగాహన లేదా?
కనీస మౌలిక సూత్రాలు కూడా తెలియని విధంగా మాట్లాడుతున్నారు.
భూ సమీకరణ వినూత్న ఆలోచన. ఆ మాత్రం తెలియదా? రాజధానికి భూములిచ్చిందెవరు? అంతా సన్నచిన్నకారురైతులే. వాళ్లెందరో తెలుసా? 20490 మంది.
సచివాలయం, కోర్టు ఇక్కడ నడుస్తుండగా పరిపాలన కు కొత్తగా డబ్బులెందుకు?
నిధులు లేవు అని చెప్పటం ఒక సాకు మాత్రమే.
ఇప్పుడు తరలింపు కోసం అదనంగా డబ్బు ఖర్చుపెట్టాలి కానీ ఉన్న వాటిని అమరావతికి వినియోగించుకోటానికి ఇబ్బందేంటి?
కావాలనే పదే పదే డబ్బులు లేవని మాట్లాడుతున్నారు.నిన్నటి వరకూ ఒకే సామాజిక వర్గం అని మాట్లాడారు. కాదు 75శాతం వెనుకబడినవారున్నారని నిరూపిస్తే వెనక్కి తగ్గారు.
తర్వాత ముంపు ప్రాంతమని మాట్లాడారు. అందుకనుగుణంగానే వరదనీరు నగరంలోకి వచ్చేలా చేసి ముంచటానికి అనేక కుట్రలు పన్నారు. అదీ సాధ్యపడలేదు.అందుకే ఇప్పుడు డబ్బులు లేవని కొత్త రాగం అందుకున్నారు.
అమరావతిని చంపి, రైతుల మీద కేసులు పెట్టి ఏదో పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారు. అమరావతి లో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటున్నారు, హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించండి. అలాగే గత ఏడు నెలలో విశాఖలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణకు సిద్ధమా?