సిఆర్ డిఎ అవినీతి కుంభకోణాలమీద ఉన్నత స్థాయి దర్యాప్తుచేయాలని ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయించింది.
కొద్ది సేపటి కిందట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి వర్గ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. ఇవి మంత్రి వర్గ నిర్ణయాలు:
అమరావతి నిర్మాణం మీద వచ్చిన అవినీతి ఆరోపణల మీద విచారణ జరిపేందుకు ఏర్పాటుచేసిన మంత్రి వర్గ ఉపసంఘం తన నివేదిక ను ప్రభుత్వానికి సమర్పించింది.
ఈ నివేదికను క్యాబినెట్ క్షుణ్ణంగా చర్చించింది. రాజధాని ప్రాజక్టులో ప్రాథమికంగా చాలా తప్పులు కనిపించాయని నివేదిక చెప్పింది. నైతిక విలువలు దిగజార్చే విధంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వారు తప్పు చేశారని కనిపించింది. దీని మీద సమగ్ర దర్యాప్తుచేయడం అవసరమని క్యాబినెట్ భావించింది. దీనికి న్యాయనిపుణుల సలహా తీసుకుంటారు.
అప్పటి ముఖ్యమంత్రి కి వాటాలున్న ఒక కంపెనీ భూములుకొనుగోలు చేసింది. 2014 డిసెంబర్ 31 అమరావతి రాజధాని ప్రకటనకు ముందు మూడు నాలుగు మాసాలలో బాగా భూములున్న కొన్నారు. ప్రాథమిక ఆధారాలుదొరికాయి. దర్యాప్తును లోకాయుక్తకు ఇవ్వాలా లేక సిబిఐ ఇవ్వాలా అనే దాని మీద న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం జరుగుతుంది.
రాజధాని పరిశీలన కోసం ఏర్పాటుచేసిన జిఎన్ రావునిపుణుల కమిటీ నివేదికను క్యాబినెట్ పరిశీలించింది. మరొక నివేదిక బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు నుంచి అందాల్సి ఉంది. అది కూడా వచ్చాక రెండింటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ రెండు నివేదికలను పరిశీలించేందుకు రాజధానికి విషయంలో మరో హై పవర్ కమిటీ వేయాలని నిర్ణయం. 3 వారాల్లో కమిటీ రిపోర్ట్ వస్తుంది.
2011 జనాభా లెక్కల లెక్కల ప్రకారం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పాటిస్తూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయించింది.
ప్రమాదం జరిగినపుడు సకాలంలో ఆసుప్రతికి తీసుకు వెళ్లలేక చాలా మందిచనిపోతున్నారు. అందువల్ల 20 నిమిషాలలలో ఆసుపత్రికి చేర్చేందుకు 108 సర్వీసును ప్రవేశపెట్టారు. ఇది గత 5 సంవత్సరాలలో మూలన పడింది. దీనిని పునరుద్ధరిస్తూ 71 కోట్ల తో కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి క్యాబినెట్ నిర్ణయించింది. 104 వాహనాలకు 656వా హనాల కొనుగోలుకు 60 కోట్ల రుపాయల విడుదలకు ఆమోదం.
191 మార్కట్ యార్డులను 150 ఉప మార్కెట్ యార్డులను శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా నడుపుతారు. 365 రోజులు ఇవి పని చేస్తాయి.
కనీస మద్దతు ధర లేని పసుపు,మర్చి,ఉల్లి, చిరుధాన్యాలక మద్దతు ప్రతి సంవత్సరంమద్ధతు ధర ముందే ప్రకటంచి కొనుగోలు చేయాలని క్యాబినెట్ నిర్ణయం.
సెంట్రల్ ఇన్ ష్టిట్యూట్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఏర్పాటుకు కృస్ణా జిల్లాలో ఆరు ఎకరాల భూమి మంజూరు
కడప జిల్లాలో రాయచోటిలో నాలుగు ఎకరాలను వక్ఫ్ బోర్డుకు బదలాయింపునకు ఆమోదం
మచిలీ పట్నం రేవు నిర్మాణానికి రైట్స్ డిపిఆర్ తయారు చేస్తుంది. పోర్టును ప్రభుత్వమే నిర్మిస్తుంది.
రామాయంపోర్టు నిర్మణానికి అడ్డంకిగా ఉన్న కృష్ణ పట్నం పరిధి కుదింపునకు ఆమోదం