కేశినేని నాని, బుద్ధా వెంకన్న గృహ నిర్బంధం, క్యాబినెట్ సమావేశానికి ఏర్పాట్లు

అమరావతి: రేపు క్యాబినెట్ సమావేశానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. మరొక వైపు అమరావతి ప్రాంతంలో ధర్నాలక పిలుపునిచ్చారు. దీనితో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొటూ ఉంది.
క్యాబినెట్  ఈ సమావేశం శాంతిభద్రతల సమస్య కాకుండా ఉండేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒక వైపు ఈ ప్రాంతంలోకి కొత్త వాళ్లెవరూ రాకుండా కట్టుదిట్టం చేస్తూ రైతులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇపుడు సీనియర్ టిడిపి నేతలను గృహనిర్బంధంలోకి తీసుకుంటున్నారు. ఈ ఉదయంతెదేపా విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ను, విజయవాడు ఎంపి కేశినానిని (కింది ఫోటో) గృహ నిర్బంధంలో ఉంచారు.
అమరావతి ఆందోళనలో భగంగా, ఈ రోజు, అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో, విజయవాడ ధర్నా చౌక్ లో, ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ఆందోళన రేపు క్యాబినెట్ జరిగేటప్పటి దాకా కొనసాగే అవకాశం ఉందనే అనుమానం తో పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.
ఈ ధర్నా కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఇతర నాయకులను అమరావతి జెఎసి ఆహ్వానించింది.
అయితే ఈ రోజు ఉదయం పోలీసులు, ముందస్తు బద్రతా చర్యల్లో భాగంగా, వీరిని హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను హౌస్ అరెస్ట్ చేసారు. అయితే పోలీసులు మాత్రం, ప్రకాశం బ్యారేజీ వద్ద నిరసనకు వెళ్తారనే ఉద్దేశంతో నిర్బంధించామని చెప్తున్నారు.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/telugu/breaking/restrictons-on-outsiders-in-amaravati-area/