ఆర్టీసి ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మరొక వరమిచ్చారు.
ఈ మధ్య 52 రోజుల సమ్మె చేసిన తర్వాత ప్రభుత్వానికి , ఆర్టీసి ఉద్యోగులకు సంబంధాలు బెడిశాయి. ఇపుడు ఈ వరాలతో ఆయన సమ్మెగాయాలను మాన్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసి సమస్యలను పరిష్కరించేందుకు యూనియన్లు అవసరం లేదని నిరూపిస్తున్నారు. ఇంతకు సమ్మెలో మరణించిన కుటుంబాలకు ఉద్యోగాలిచ్చారు. ఇపుడు మరొొక ముఖ్యమయిన వరమిచ్చారు.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇపుడు అడగక ముందే ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంచారు.
దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం సంతకం చేశారు.
ఆర్టీసీలో పని చేసే ప్రతీ ఉద్యోగికీ పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం వర్తిస్తుంది. ఇటీవల ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో పదవీ విరమణ వయస్సును పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు.