2. రాజకీయ పార్టీల అధినేతలు గుండెలు బాదుకుంటున్నారు.
3. కమలానంద భారతి స్వామి, కంద దేవానందగిరి స్వామి లాంటి మతాధిపతులు స్పందిస్తున్నారు.
కాని రాయలసీమ దుస్థితిని తెలిపే కింద వివరించిన దృష్టాంతాలు వీరికి వినిపించవు, కనిపించవు.
1. స్వర్ణసీమకు స్వాగతం నవలలోని పాత్ర అనే మాటలు “ఇక్కడికి వచ్చిన ప్రతి పెద్దమనిషీ ఈడ బంగారం దొరుకుతాదా అని అడుగుతారేగానీ, ఎవురేగాని ఇక్కడ నీళ్ళు దొరుకుతావుండాయా అని అడుగుతా ఉంటాడా? రాయలసీమ పరిస్థితిని కళ్ళకు కట్టినట్లుగా తెలియచేస్తాయి.
2. రోడ్లు తవ్వి, అన్ని రకాల ఇబ్బందులకు గురిచేసినా, తాగడానికి గుక్కెడు నీళ్ళ కోసం వేలాదిగా వచ్చిన రాయలసీమ ప్రజలు అత్యంత శాంతియుతంగా, సహనంతో సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన చేసిన తీరు రాయలసీమ పరిస్థితిని సభ్య సమాజం ముందుంచుంది.
రాయలసీమ బతుకు తెరువు సమస్య మీడియా, రాజకీయ పార్టీలు, మతాధిపతులు మానవత్వంతో గుర్తించి, స్పందిస్తారని ఆశిద్దామా ?