మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కేంద్రం తీసుకుని పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కి మద్దతు తెలిపారు. ఈ విషయంలో జరుగుతున్న ఆందోళనను ఆయన వ్యతిరేకిస్తూ రాజకీయం కోసమే ప్రతిపక్షాలు CAAపై అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి అపోహలతో ముందుకు పోతున్న భారతదేశానికి నష్టం జరుగుతుందని ఆయన చెప్పారు. ‘సోనియాగాంధీకి సైతం పౌరసత్వం ఇచ్చిన గొప్పదేశం మనది. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు సిఎఎ గురించి భయపడాల్సినవసరం లేదు . ఎన్ ఆర్ సి , సిఎఎలు ఏ వర్గానికి, మతానికి వ్యతిరేకం కాదు. దేశం నుంచి ముస్లింలను వెళ్ళగొట్టమని ఎవరు చెప్పటంలేదు.15శాతమున్న ముస్లింల హక్కులను ఎవరూ కాలరాయలేరు,’ అని నాదెండ్ల భాస్కరరావు అన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
సిఎఎ పై పార్లమెంట్ లో అసదుద్ధీన్ ప్రసంగం అభ్యంతరకరంగా ఉంది.
అల్లర్లు చేయటం దేశంలో కొందరికి అలవాటుగా మారింది
చొరబాటు దారులను అడ్డుకోవటానికే బీజేపీ సిఎఎ ను తీసుకొచ్చింది
బెంగాల్ సీఎం మమత పౌరసత్వ సవరణ చట్టంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు.
తమ రాష్ట్రాల్లో సిఎఎ ను అమలు చేయమని కొందరు ముఖ్యమంత్రులనటం సరైంది కాదు.