దుర్వార్త : అల్లూరి సీతారామరాజు జ్ఞాపకాలిలా చెరిగిపోతున్నాయ్…

(జింకా నాగరాజు)
గత వందేళ్లలో యూరోప్ వంటి నిండా గాయాలయ్యాయి. రెండు ప్రపంచయుద్ధాలు, నాజీ దురగతాలు,తర్వాత కమ్యూనిజం, ఆపైన కమ్యూనిజం వైఫల్యం… అంతర్యుద్ధాలు, దేశాలు విచ్ఛిన్నం కావడం, జర్మనీ విలీనం టెన్షన్… ఇలా ఆధునిక యూరోప్ చరిత్ర ఎపుడూ ప్రశాంతంగా లేదు.
అయితే దీన్నే యూరోప్ దేశాలు వార్ టూరిజంగా మార్చుకుని విపరీతంగా రెవిన్యూ సమకూర్చుకుంటున్నాయి. రెండవ ప్రపంచ యుద్దం (1939-45) లో దెబ్బతిన్న దేశాలన్నీ, యుద్ధానికి సంబంధించి ప్రతి కట్టడాన్ని గొప్ప టూరిస్టు కేంద్రంగా మార్చకున్నాయి. జర్మనీ వరల్డ్  వార్ 2 మెమోరియల్ టూర్ (Wrold War II Memorial Tour) అనేది అక్కడొక పెద్ద ఇండస్ట్రీ ఇపుడు. చాలా ప్రయివేటు టూర్ అపరేటర్లు ఇలా రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ప్రదేశాలను కట్టడాలను కలుపుతూ విజ్ఞాన వినోద యాత్రలు ఏర్పాటుచేస్తున్నారు.
ఆ దేశాలు పెద్ద ఎత్తున వార్ మ్యూజియమ్స్ ఏర్పాటుచేసుకున్నాయి. వీటికి తోడు రెండో ప్రపంచయుద్దంలో చని పోయిన వారి స్మశానాలు, యుద్ధంలో కూలిన కట్టడాలు, సైనిక భవనాలు, షెడ్లు, నాజీ కాన్సెంట్రేషన్ క్యాంపులు,జైళ్లు అన్నీ ఇపుడు పర్యాకట ఆకర్షణలుగా మారిపోయాయి.
యుద్ధంలో పాల్గొని ఇంకా జనం మధ్య వున్నసైనికులను,పౌరులను కొందరిని తీసుకువచ్చి టూర్ ఆపరేటర్లు వారి అనుభవాలనుచెప్పిస్తున్నారు.
ఒక యూరోపియన్ వార్ మెమోరియల్ టూర్ ఇలా 15 రోజుల పాటు అయిదూ యూరోపియన్ దేశాలలో (ఫ్రాన్స్, బెల్జియం,లక్సెంబర్గ్, జర్మనీ, నెదర్లాండ్స్) లలో2750 కిమీ పొడవునా సాగుతుంది. ఇందులో పారిస్ వంటి మహానగరాలున్నాయి. చిన్న పల్లెలున్నాయి.
ఇలాంటి టూరిజం భారతదేశంలో ఎక్కడా తయారయినట్లు లేదు. ఆమధ్య బుద్ధిస్టు సర్యూట్ అంటూ ఒక యాత్ర ప్రారంభించారు. ఇలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడాచేస్తామన్నారు. మన ప్రభుత్వాలు ప్రారంభోత్సవాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాయి. అందుకే ప్రారంభం ఉత్సవంగా జరుపుతారు. ఆతర్వాత దానిని పట్టించుకోరు.లేదా చారిత్రక ప్రదేశాలను అసలు పట్టించుకోనే పట్టించుకోరు. ఇపుడివి రియల్ ఎస్టేట్ బారిన పడుతున్నాయి.
ఉదాహరణం విశాఖ పట్టణం సమీపంలోని ఎర్రమట్టిదిబ్బలు (Erramatti Dibbalu) అనేవి చాలా చారిత్రకప్రాధాన్యమున్న దిబ్బలు. వీటిని కాపాడుకోవాలని మేధావులంతా ప్రభుత్వాన్ని కోరుతుున్నారు. ఇపుడు వీటి విధ్వంసం కొనసాగుతూ ఉందని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి,రిటైర్డరు ఐ ఎ ఎస్ అధికారి డాక్టర్ ఇఎఎస్ శర్మ ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాశారో లెక్కేలేదు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో ఇలాంటి చారిత్రక, శిల్పకళ ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలను కలుపుతూ చిన్న చిన్న టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేయడం వల్ల చారిత్రక సృహ పెరుగుతుంది. ప్రభుత్వానికి రాబడిపెరుగుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. శ్రీలంక రామాయణం టూరిజం సర్య్కూట్ ను ఏర్పాటు చేసి భారతీయులను ఆకట్టు కునే ప్రయత్నం చేస్తూ ఉంది.
ఇంతకీ ఈ విషయం ఎందుకుప్రస్తావించానంటే, ఈ రోజు ది హిందూ (The Hindu) పత్రికలో Freedom Struggle Memorabilia Lie Forgotten Here అని పేరుతో ఒక వార్త వచ్చింది.
ఈ వార్త 1922 లో రంపచోడవరం పోలీస్ స్టేషన్ కు సంబంధించింది. ఈ భవనం శిధిలావస్థకు చేరకుంది. ఆవరణలో సహజంగా  చెత్త పడేస్తున్నారు. ఇక ముందు ఈ ప్రాంతంలో భూములు రేట్లు పెరిగిపోవచ్చు. దీని మీద రియల్టర్ల కళ్లు పడతాయి. లేదా భవనం కూలిపోవచ్చు. భూమి కబ్జా కావచ్చు లేదా ప్రభుత్వమే మరొక నిర్మాణం చేపట్టవచ్చు. లేదా మిగులు భూమికింద ప్రభుత్వమే వేరెవరికైనా విక్రయించవచ్చు.ఈ చారిత్రక శకలం చుట్టు ఇన్ని ప్రమాదాలుపొంచిఉన్నాయి.
ఈ పోలీస్ స్టేషన్ విశేషమేమిటంటే… 1922-1924 మధ్య అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో బ్రిటిష్ నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా రంప తిరుబాటు (Rampa Rebellion) జరిగిన విషయం తెలుసుగదా.మన్యం తిరుగుబాటు (Manyam rebellion) అన్నా ఇదే.
అపుడు 1922లో సీతారామరాజు ఈ పోలీస్ స్టేషన్ మీద దాడి చేశాడు. తర్వాత  చింతపల్లి, క్రిష్ణా దేవి పేట, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ ల మీద కూడా మన్యం విప్లవ వీరుడు దాడి జరిపారు.
అల్లూరి దాడి తర్వాత బ్రిటిష్ వాళ్లు ఈ పోలీస్ట్ స్టేషన్ కట్టదిట్టంగా పునర్నించారు. ఇపుడు ఈ బిల్లింగ్ ఖాళీగా మూలన పడి ఉంది. ఆలనాపాలనా లేక పాతబడిపోతూ ఉంది.
ఈ ఆవరణలోనే ఉన్న మరొక భవనంలో పోలీస్ స్టేషన్ మారిపోయింది. ఈ పాత బిల్డింగులో రంప తిరుగుబాటును గుర్తు చేసిన అనేక వస్తువులున్నాయి.
బ్రిటిష్ ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు 50 ఎకరాల భూమి అప్పగించి ఆయనను మచ్చిక చేసుకోవాలని ప్రయత్నించింది. సీతారామరాజు దానికి అంగీకరించలేదు. దీనిని తిరస్కరింస్తూ సీతారామారాజు ఒక లేఖ రాశారు. ఆలేఖ కూడా ఇక్కడ ఉంది.
అంతేకాదు, రంప తిరుగుబాటులో పాల్గొన్న వీరుడు మల్లుదొర, సీతారామరాజు తల్లి సూర్యనారాయణమ్మ, చెల్లెలు సీతమ్మల ఫోటోలు కూడా ఉన్నాయి.
మ్యూజియం ఏర్పాటు ప్రయత్నం విఫలం
ఈ చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ భవనాన్ని పోలీసు శాఖ సహాయంతో మ్యూజియంగా మార్చాలని ఇక్కడి అల్లూరి సీతారామరాజు యువజన సంఘం (Alluri Sitaramaraju Yuvajana Sangham : ASYS) ప్రయత్నించింది. ఈ ప్రయత్నం ముందుకు సాగలేదు. ఇపుడు ఇది పోలీస్ స్టేషన్ వారు ఒక కిచెన్ గా వాడుకుంటున్నారు. ఇది బాధకరమయిన సంఘం అధ్యక్షుడు పడాల వీరభద్రరావు అన్నారు. ఇది చారిత్రక కట్టడంగా చూడాలని దీనికి పర్యాటక ఆకర్షణ ఉందన్న విషయం విస్మరించరాదని ఆయన అభిప్రాయపడుతున్నారు.
ఎన్ సాంబశివరావు డిజిపిగా ఉన్నపుడు ఈ పోలీస్ స్టేషన్ ను లైబ్రరీగా మార్చేందుకు ఒక ప్రతిపానను అంగీకరించారు. అయితే, ఇది నక్సలైట్లు ఉండే ప్రాంతమని, ఇక్కడి ప్రజలను అనుమతించరాదని చెబుతూ ఆ ప్రతిపాదనను పక్కన పడేశారు.
దీనిని మ్యూజియంగా మారిస్తే, ఇక్కడి స్థానిక చరిత్ర పదిలమవుతుంది, అది విద్యార్థులకు, ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది, ఉత్తేజకరంగా ఉంటుందని పడాల భావిస్తున్నారు.
ఇదీ సంగతి. మనం యూరోప్ కు ఎంత వెనకబడి ఉన్నామో చూశారా.
యూరోప్ లో చెక్ రిపబ్లిక్ అనే చిన్న దేశం ఉంది. చెకియా అని కూడా పిలుస్తారు. దీని జనాభా కోటి(10,649,800 : 2019). ఈ దేశంలోని ప్రతిచారిత్రక కట్టడాన్ని, ద్రాక్ష తోటలను, పురాతన భవనాలను వీళ్లు టూరిస్టు కేంద్రాలుగా మార్చుకున్నారు. ఈ దేశానికి ఏటా రెండుకోట్ల మంది పర్యాటకులొస్తారు. అంటే దేశజనాభా కంటే పర్యాటకులే ఎక్కువ. దీనితో ఈ దేశ జిడిపి బాగాపెరిగింది. చెక్ తలసరి జిడిపి 38,834,214 డాలర్లు. ప్రపంచం తలసరి జిడిపిలో చెక్ ర్యాంక్ 40.
ఇండియా పర్ క్యాపిటా జిడిపి 2041.091 అమెరికన్ డాలర్లు.ప్రపంచంలో ఇది 40 వ స్థానం. భారతదేశం తలసరి జడిపి ఎంతో తెలుసా? ఏసియాలో 31 ర్యాంకు, ప్రపంచం స్థాయిలో ర్యాంకు 126.

(Featured photo source The Hindu)

Research News from University of Greenwich

https://trendingtelugunews.com/english/features/research-shows-two-pints-peer-works-more-effectively-than-paracetamol-as-pain-killer/