వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహించే ముక్కోటి ఏకాదశి ఉత్సవాల వాల్ పోస్టర్ ను దేవాదాయ శాఖమంత్రిఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ నెల 27 నుంచి జనవరి 16 వరకు భద్రాద్రి ముక్కోటి ఉత్సవాలు జరగుతాయి. జనవరి 4 వరకు స్వామివారు రోజుకో అవతారంలో దర్శనమిస్తారు. జనవరి 5న తెప్పోత్సవం, 6న ఉత్తర ద్వారా దర్శనం ఉంటుంది.
ఈ ఉత్సవాలకు రావాలని భాసర ఆలయ ఈవో, వేద పండితులు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వానించారు.
ఆదివారం శాస్త్రినగర్ లోని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికను అందించారు.
అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముక్కోటి ఏకాదశి ఉత్సవాల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ముక్కోటి మహోత్సవాలకు వివిధ ప్రాం తాల నుంచి తరలివచ్చే భక్తులు సంతృప్తి చెందేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు.