మందు వ్యతిరేకించే వాళ్లు కొద్దిసేపు చప్పుడు చేయకుండా కూచోండి…బీరు ప్రియులకు ఒక శుభవార్త వచ్చింది. అయితే ఎగిరి గంతేసే ముందొక సారి దీన్ని పూర్తిగా చదవండి.
తలనొప్పికి పారసీటమాల్ ట్యాబ్ లెట్ కంటే బీర్ బలంగా పనిచేస్తుందని పరిశోధనలో తేలింది. ఇదే చాన్సని తెగలాగించే ఇతర సమస్యలొస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఇక చదవండి…
పారసీటమాల్ చాలా పాపులర్ పెయిన్ కిల్లర్. కొద్దిగా జ్వరమొచ్చినా,తల నొప్పిగా ఉన్నా, వొళ్లునొప్పులున్నా ఎవరి సలహా లేకుండా గుటుక్కున ఒక గోలి మింగి కోలుకోవచ్చు. అయితే, ఇలా వొంటినొప్పులో తలనొప్పో ఉన్నపుడు రెండు పింట్ ల బీరు అంతకంటే అద్భతంగా పనిచేస్తూందని యూనివర్శిటీ ఆఫ్ గ్రీన్ విచ్,లండన్ పరిశోధకులు కనుగొన్నారు.
వీళ్లకి బీరు మీద పరిశోధన చేయాలని అనిపించేందుకుకారణం, జనంలో ఉన్న ఒక నమ్మకమే. ఆల్కహాల్ కు నొప్పి హరించే గుణం (analgesic) ఉందని అంటూంటారు. మందుకు మందే విరుగుడు అని హ్యాంగోవర్ తో ఉన్న వాళ్లు కూడా అపుడపుడు జోక్ చేసి మరొక పెగ్గు లాగిస్తూ ఉంటారు. ఇది కొంచెం ఎక్స్ ట్రా అని చాలా మంది అనుకుంటుంటారు. కాదు. ఇదెంతవరకునిజమో కనుగొనాలనుకున్నారు. దీని వల్ల ఆల్కహాలులో ఏ కాంపౌండ్ ఇలా పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుందో తెలుస్తుంది. అపుడు కొత్త ఔషధాలు కూడా తయారు చేయవచ్చు.
‘మందు’ నిజంగా మందులాగా పనిచేస్తుందనేది మూఢనమ్మకమా లేక దీని వెనక ఏమయిన సైన్సుందా అని కనుగొనాలనుకున్నారు ఈ శాస్త్రవేత్తలు.
గ్రీన్ విచ్ యూనివర్శిటీ పరిశోధన (2017) లో రెండు పింట్ల బీర్ పాపులర్ పెయిన్ కిల్లర్ కంటే 24 శాతం ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తుందని కనుగొన్నారు.
సుమారు నాలుగు వందల మందికి జలుబు, ఉష్ణోగ్రత, పనివత్తిడితో తల నొప్పి సృష్టించారు. వీళ్ల మీద మొత్తం 18 ప్రయోగాలు చేశారు. ఈ ఫలితాలను జర్నల్ ఆఫ్ ఫెయిన్ (Journal of Pain) లో ప్రచురించారు.
బీర్ కు ఎంత చెడ్డ పేరున్న ఈపరిశోధనలో అదినిజందా మంచి ‘మందు’ అని తేలిసింది.ఈప్రయోగంలో బాధితులందరిలో తలనొప్పితీవ్రత బాగా (clinically-relevant)తగ్గింది.
ఈ పరిశోధనకు సీనియర్ సైకాలజీ లెక్చరర్ డాక్టర్ ట్రెవర్ థాంప్సన్ నాయకత్వం వహించారు. ఈపరిశోధనా ఫలితాలమీద వ్యాఖ్యానిస్తూ నొప్పి మీద ఆల్కహాల్ చాలా బలంగా పనిచేసిందని, ఇది కోడైన్ వంటి ఒపియాడ్ డ్రగ్ తో సమానంగా పనిచేసిదని ధాంప్సన్ చెప్పారు.
ఆల్కహాల్ ప్రభావం పారసీటమాల్ కంటే చాలా ఎక్కుగా నొప్పితగ్గించింది. తల నొప్పి తీవ్రంగా ఉన్నపుడు నాలుగు యూనిట్ల ఆల్కహాల్, లేదా రెండు పింట్ల బీర్ల లేదా మీడియం గ్లాస్ వైన్ తీసుకుంటే నొప్పి 24 శాతం తగ్గిందని ఆయన చెప్పారు.
దీనికి కారణం, ఆల్కహాల్ కూడా నొప్పిని తగ్గించే క్యాటమైన్ వంటి ఔషధాలుపనిచేసే నర్వ్ రిసెప్టర్స్ మీద పనిచేయడం. మరొక అదనపు కారణం. అల్కహాల్ యాంగ్జయిటీని తగ్గించి కూడ నొప్పి ప్రభావం కనిపించకుండా ఉపశమనం కల్గిస్తుంది.
చాలా మందిలో ఆల్కహాల్ దుర్వినియోగానికి కారణం వొంటినొప్పులకు ఆల్కహాల్ కు ఉపశమనం కల్గించే సంబంధం ఉండటమే నని ధాంప్సన్ భావిస్తున్నారు. అయితే, దీని వల్ల ఆల్కహాల్ ను దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, తమపరిశోధన భవిష్యత్తుల ఇకా బాగా పనిచేసే పెయిన్ కిల్లర్స్ తయారుచేసేందుకు బాట వేస్తుందని ఆయన చెప్పారు. ఎలాగంటే… ఆల్కహాల్ లోని ఏ పదార్థం ఇలా పెయిన్ కిల్లర్ పనిచేస్తుందో సపరేట్ చేసి కొత్త మందులు తయారుచేయవచ్చు. అపుడు టాక్సిసిటీ లేని ఆల్మహాల్ అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు.
తమ పరిశోధనను అడ్డుపెట్టుకుని తల నొప్పివచ్చినపుడల్లా బీర్ తాగాలనుకోవద్దని ధాంప్సన్ హెచ్చరిస్తున్నారు. ఇలా తలనొప్పి పేరుతో రోజూ బీరు లాగిస్తే,ఇతర ఆరోగ్యసమస్యలొస్తాయని ఆయన చెబుతున్నారు.