అమరావతి స్థానంలో మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు ఏర్పాటుచేయాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనకు రాయలసీమ విద్యార్థులు మద్దతు ప్రకటించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన నేత పవన్ కల్యాణ్ వ్యతిరేకిస్తున్నందుకు నిరసన తెలిపారు. కర్నూలు నగరంలో ఈ మేరకు వారి శవయాత్ర జరిపారు.
బనగానపల్లె లో పాలాభిషేకం
ఇక్కడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కర్నూలును జుడీషియల్ రాజధానిగా ప్రకటించినందుగాను,శ్రీబాగ్ ఒప్పందాన్ని గౌరవించి రాయలసీమలో హైకోర్ట్ ఏర్పాటు చేయోచ్చనే ప్రతిపాదన తెచ్చినందుకు ఇక్కడి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనకు ధన్యవాదాలు చెబుతూ జగన్ చిత్రపటానికి విద్యార్థులు రాయలసీమ ఉద్యమకారులు పాలాభిషేకం నిర్వహించారు.
అదే విధంగా శ్రీబాగ్ ఒప్పందంలో ఉన్న కృష్ణ తుంగభద్ర నీళ్లలలో వాట,అసెంబ్లీ స్థానాల పెంపు,కేంద్రరాష్ట్ర విశ్వవిద్యాలయాలు రాయలసీమలో ఏర్పాటు చేసే విధంగా వైసిపి ప్రభుత్వం మరియు వైసిపి అధినేత ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేయాలని కోరారు.