కళ్ల ముందు ఉరితాడు వేలాడుతూ కనబడతూ ఉంది. నిర్భయ కేసులో సుప్రీంకోర్టు చివరి మరణ శిక్షరివ్యూపిటిషన్ కొట్టే సిన తర్వాత మరణ శిక్ష అమలు ఏర్పాట్లు వూపందుకుంటున్నాయి.
ఉరిశిక్ష అమలుచేయాలంటే భారత దేశంలో కొన్ని విధానాలు పాటించాలి. అవి పూర్తయ్యే దాకా మరణ శిక్ష అమలుచేయడం సాధ్యం కాదు.
ఇపుడు నిర్భయ కేసులో మరణ శిక్ష అనుభవిస్తూ తీహార్ జైలులో ఉన్న నిందితులు కూడా ఈ న్యాయపరంగా ఈ అవకాశాలన్నింటిని వినియోగించుకోవచ్చు.
అక్షయ్, పవన్ గుప్తా, ముఖేస్, వినయ్ శర్మ మరణ శిక్ష నుంచి తప్పించుకునేందుకు న్యాయపరంగా ఉన్న మార్గాలన్నింటిని పరీక్షిస్తున్నారు. మరొకవైపు వీళ్లను ఉరితీయాల్సిందేనని, హైదరాబాద్ దిశ దాడి తర్వాత ప్రజలనుంచి వత్తిడి తీవ్రమయింది.
వీళ్ల ఉరిశిక్ష కు సంబంధించి నేరస్థుడు అక్షయ్ రివ్యూపిటిషన్ ను నిన్న సుప్రీంకోర్టు కొట్టి వేసింది.అయితే, అతనికి సుప్రీంకోర్టుకు మరొక సారి క్యూరెటివ్ పిటిషన్ (curative petition) ద్వారా నివేదించుకునే అవకాశం ఉంది.
క్యూరెటివి పిటిషన్ అంటే ఏంటోతెలుసా?
ఇది భారత న్యాయవ్యవస్థలోకి కొత్తగా చేరిన విధానం. 2002లో సుప్రీంకోర్టు నేరస్థుడికి తనకు పడిన శిక్ష మీద మరొక సారి కోర్టుకు నివేదించుకునేందుకు సుప్రీంకోర్టే ఈ విధానం ఆమోదించింది.
అశోక్ హుర్రా వర్సెస్ అశోక్ హుర్రామరొకరు (2002) కేసులో ఈ విషయం చర్చకు వచ్చింది. శిక్ష మీద వేసిన రివ్యూపిటిషన్ ను తిరస్కరించిన తర్వాత, న్యాయనిర్ణయ విధానంలో ఎక్కడైనా పొరపాట్లు జరిగాయా, తప్పిదాలున్నాయా,చట్టాల దుర్వినియోగొ జరిగిందా అని పరిశీలించి మరొక సారి కేసును శిక్షను పున:సమీక్షించేందుకు అంగీకరించాలని కోర్టు భావించింది.
ఇలాంటి చిట్ట చివరి పున: సమీక్షకోసం వేసే పిటిషన్ నే క్యూరెటివ్ పిటిషన్ అంటారు. ఈ క్యూరెటివ్ పిటిషన్ వేసుకునేందుకు అక్షయ్ కు ఒక అవకాశం ఉంది. అక్షయ్ కుమార్ సింగ్ లాయర్ కె ఎల్ శర్మ ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
క్యూరెటివ్ పిటిషన్ వేసేందుకు కేసుకు కొన్ని అర్హతలను కోర్టు సూచించింది. తనకు శిక్షను వేస్తున్నపుడు ప్రిన్సిపుల్ ఆప్ న్యాచురల్ జస్టిస్ (సహజన్యాయసూత్రాలు) ను ఉల్లంఘించారని పిటిషనర్ చూపాల్సి ఉంటుంది.
అదే విధంగా న్యాయమూర్తులు తన వివక్షతో శిక్ష వేశారన్న అనుమానం ఉంటే దానిని వ్యక్తం చేయాలి. అదే విధంగా శిక్ష విధిస్తూ ఇచ్చిర తీర్పును సమీక్షించాలని వేసిన పిటిషన్ పరిశీలనలో లోపాలున్నాయన్న విషయాన్ని చూపించాలి.
అపుడు పిటిషన్ ను సుప్రీంకోర్టు లోని ముగ్గురు సీనియర్ మోస్టు న్యాయమూర్తులకు, తర్వాత, శిక్ష విధించిన న్యాయమూర్తులకు పంపిస్తారు. ఇందులో శిక్ష విధించడంలో పొరపాట్లున్నాయని మెజారిటీ న్యాయమూర్తులు భావిస్తే, పిటిషన్ విచారణ కోసం శిక్ష విధించిన ధర్మాసనానికే పంపిస్తారు.
క్యురెటివ్ పిటిషన్ మెరిట్ లేక పోతే, కోర్టు తీవ్రంగా పరిగణించి భారీ జరిమానా విధించవచ్చు. ఇపుడ అక్షయ్ కు క్యూరెటివ్ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంది. తర్వాత రాష్ట్రపతికి క్షమా భిక్ష దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్టప్రతి క్షమాభిక్షను దరఖాస్తును తిరస్కరిస్తే దానిని కోర్టులో సవాల్ చేసేందుకు మరొక అవకాశం ఉంది.
ఈ విధానాలన్నీ పూర్తయ్యాకే జైలు అధికారులు లోకల్ కోర్టు నుంచి డెత్ వారంట్ తీసుకోవలసి ఉంటుంది.
ఇపుడు జైలులో ఉన్న నిందితులంతా బాగా కలత చెందుతున్నారని అధికారులు చెబుతున్నారు. దీనితో వాళ్లే మయినా అఘాయిత్యానికి పాలుపడకుండా వుండేందుకు జైలుఅధికారులు వాళ్ల మీద బాగా నిఘాపెంచారు.
ఉరి తీయడం గురించి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. తీహార్ జైలులో ఉరిశిక్ష అమలు చేసేందుకు ఎవరూ అందుబాటులో లేరు. దీనికోసం తలారిని ఎంపిక చేయాలి. అయితే, చాలా మంది తాము సిద్ధంగా ఉన్నామని ముందుకు వచ్చారని అధికారులు చెబుతున్నారు.
ఇది ఇలా ఉంటే, తీహార్ జైలు అధికారులు రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం నలుగురుకి నోటీసులిచ్చారు. దీనికోసం వారం రోజుల గడువు ఇచ్చారు. ఈ లోపు వారు రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకోవాలి. అలా కాని పక్షంలు అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు. రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరిస్తే దానిని కూడాకోర్టులో సవాల్ చేసేవీలుంది…