మందుబాబులూ గుండె జాగ్రత్త అంటున్నారు రష్యా శాస్త్రవేత్తలు.ఇంతవరకు మందు కొడితే లివర్ మాత్రమే డ్యామేజ్ అవుతుందనుకునే వాళ్లు. ఇపుడు లివరే కాదు,గుండెకండరాలు కూడా దెబ్బతింటాయని తాజా పరిశోధనలో తెలింది. ఈ పరిశోధనా ఫలితాలు జర్నల్ అఫ్ ది అమెరికన్ హార్ట్ ఆసోసియేషన్ ( Journal of the American Heart Association) తాజా సంచిక డిసెంబర్ 18, 2019లో ప్రచరితమయ్యాయి.
మందు బాగా తాగే వాళ్లు ఎన్నిరకాల గుండె జబ్బులొచ్చే రిస్క్ ఉందో తెలిస్తే ఉన్న గుండె ఆగిపోతుంది. అయినా సరే తెలుసుకోక తప్పదు. ఆల్కహాలిక్ కార్డియ్ మయోపతి (గెండు కండరాలు బలహీనపడటం), హార్ట్ ఎటాక్, ఎరీథ్మియా, స్ట్రోక్, హై బిపి…చివరకు మరణం సంభవిస్తుంది. ఇపుడు ఇవన్నీ తప్పక వస్తాయని పరిశోధనలో రుజువుయింది.
మందుకొట్టకపోతే ఉండేలేమనుకునే వాళ్లు కొద్ది గా అంటే మాడరేట్ గా డ్రింక్ తీసుకుంటే ఏంకాదంటున్నారు. కొద్దిగా అంటే ఎంత? మగవాళ్లయితే 2 డ్రింకులు, మహిళలయితే ఒక డ్రింకు ను మాడరేట్ అంటారు. ఈ కొలత తీసుకునే మందును బట్టి మారుతుంది. ఒక డ్రింక్ అంటే 12 ఔన్సుల బీర్, నాలుగు ఔన్సుల వౌన్, 1.5 ఔన్సుల స్ట్రాంగ్ లిక్కర్ (జిన్ , వోడ్కాలతో కలపి).
ఇపుడు అమెరికా శాస్త్రవేత్తలు గుండకండరాలు (Heart muscles) నష్టపోయేందుకు మందు సేవించడానికి సంబంధం ఉందని కనుగొన్నారు. అయిదు సందర్భాలలో గుండె కండరాలు దెబ్బతింటాయని ఈ ప్రయోగాలల్లో తేలింంది.
ఈ శాస్త్రవేత్తలు 35-69 సంవత్సరాల మధ్య ఉన్న 2500 మంది మందుబాబుల రక్తనమూనాలు సేకరించి 2015 నుంచి 2018 దాకా పరీక్షలు నిర్వహించారు. వీళ్లలతో మందు అలవాటుతో బాధపడుతున్నవారే. వాళ్లకున్న మందు అలవాటునుబట్టి వాళ్లని వివిధవర్గాలుగా విభజించారు. వీళ్లలో కొద్ది గా డ్రింక్ తీసుకునే వాళ్లున్నారు, హెవీ డ్రింకర్స్ ఉన్నారు, డ్రింక్ తీసుకున్నా ప్రభావం కనిపించని వాళ్లూ ఉన్నారు. కొంతమంది మందుఅలవాటు లేని వాళ్లను కూడాప్రయోగాలకు తీసుకున్నారు. వీళ్ల గుండె కండరాలు ఏమాత్రం దెబ్బతిన్నాయో కనుగొనేందుకు రక్త పరీక్షలు నిర్వహించారు.
రక్తంలో ట్రోపోనిన్ టి అనే ప్రొటీన్ ఏ మోతాదులో ఉందో పరిశీలించారు. హై సెన్సిటివిటీ కార్డియాక్ ట్రోపోనిన్ టి అనేది గుండె కండరాలు దెబ్బతిన్నపుడు రక్తంలోకి విడుదలయ్యే ప్రొటీన్. దీనివల్ల గుండె గాయపడిందని తెలుస్తుంది.
వీళ్ల పరిశీలించిన మరొక పదార్థం ఎన్ టర్మినల్ ప్రొ-బి-టైప్ న్యాట్రి యూరెటిక్ పెప్టైడ్ (N-terminal pro-B-type natriuretic peptide). గుండె వాచి కండరాలు సాగినపుడు విడుదలయ్యే హార్మోన్.
వీళ్లు రక్తంలో పరిశీలించిన మరొక పదార్థం హై సెన్సిటివిటి సి-రియాక్టివ్ ప్రొటీన్ (C-reative Protein CRP). ఇది గుండె ఉబ్బినపుడు వెలువడేదే.
ఈ మూడుమార్కర్ల కోసం వాళ్ళు సేకరించిన రక్తంలో వెదికారు. మందు అలవాటులేని వారికంటే ( లేదా కొద్దిగా తీసుకునే వారికంటే), మందుకొట్టే వారిలో ఈ బయోమార్కర్లన్నీ బాగా పెరిగాయి. ట్రోపొనిన్ -టి 10 శాతం, న్యాట్రి యూరెటిక్ పెప్టైడ్ మోతాడు 47 శాతం,సిఆర్ పి 69 శాతం పెరిగి ఉండటం కనిపించింది.
దీనిని బట్టి మద్యం బాగా సేవించడం వల్ల గుండె దెబ్బతింటూ ఉందని, అది ఏ ప్రమాదానికైనా దారితీయవచ్చని వాళ్లు చెబుతున్నారు.