అమరావతి : వృద్ధాప్య పెన్షన్ల విషయం లో ముఖ్య మంత్రి జగన్ రాష్ట్రం లోని వృద్ధు లను మోసం చేశాడని, ఇది తప్పని జనసేన నేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రతినెలా రు. 750 వారు కోల్పోతున్నారని పవన్ అన్నారు. ఓటు వేసినందుకు ఇది శిక్ష అని ఆయన అన్నారు.
పవన్ ఇంకా ఏ మన్నారంటే…
“వైసీపీ ఎన్నికల హామీ లో వృద్ధాప్య పెన్షన్ రూ. 2 వేలు నుంచి రూ. 3 వేలు అన్నారు
వృద్ధాప్య పెన్షన్ పొందే అర్హతను 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తాం అన్నారు
అధికారంలోకి వచ్చాక – పెన్షన్ రూ. 3 వేలు చేయలేదు. రూ. 2,250 మాత్రమే చేశారు.
ఒక్కో పింఛన్ లబ్ధిదారుడు రూ. 750 నష్టపోతున్నారు.
పెన్షన్ పొందే వయసు 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తున్నామని మే 30వ తేదీన ఇచ్చిన జీవో ఎం. ఎస్. నెంబర్ 103 ద్వారా చెప్పారు.
ఈ విధంగా తగ్గించడం వల్ల దాదాపు కొత్తగా మరో 10 లక్షల మందికి పెన్షన్ దక్కాలి.
కానీ ఈ రోజు వరకూ ఒక్క కొత్త పింఛన్ లబ్ధిదారుకీ ఒక్క రూపాయి ఇవ్వలేదు.
వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న రూ. 2,250 లెక్కనే చూసుకున్నా- ఒక్కో కొత్త పింఛన్ లబ్ధిదారు కుటుంబం ఈ 7 నెలల్లో రూ. 15,750 కోల్పోయింది.
ఓటు వేసినందుకు ఒక్కో కొత్త వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారు కుటుంబం ఈ ఏడు నెలల్లో కోల్పోయింది అక్షరాలా రూ. 15,750.”