డిసెంబరు17 న ఢిల్లీలో జరిగే కేంద్ర ప్రభుత్వ ఫ్రీ బడ్జెట్ సమావేశానికి బొజ్జా దశరథరామిరెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం ఆహ్వానంచింది. అలాగే
18 న నీతి ఆయోగ్, వరల్డ్ బ్యాంకు సమావేశంలో బొజ్జా దశరథరామిరెడ్డి పాల్గొంటారు.
ఈ సమావేశాలలో వ్యవసాయం రంగానికి సంబంధించి పలు సూచనలు, సలహాలు బొజ్జా దశరథరామిరెడ్డికి చేస్తారు.
ఈ నెల 17 న ఢిల్లీలో జరిగే కేంద్ర ప్రభుత్వ ఫ్రీ బడ్జెట్ సమావేశంలో పాల్గొని వ్యవసాయ రంగానికి సంబంధించి సలహాలు, సూచనలు అందజేయాలని అఖిల భారత రైతాంగ సమాఖ్య సెక్రటరీ జనరల్ బొజ్జా దశరథరామిరెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించిందని రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయి నుండి వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో చేపట్టవలసిన అంశాలపై శుక్రవారం నంద్యాలలోని రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రధాన కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ప్రధానంగా ఈ క్రింది వివరించిన అంశాలపై కేంద్ర బడ్జెట్ లో కీలక నిర్ణయాలు చేపట్టాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది.
● వ్యవసాయ ఉత్పత్తులకు లాభసాటి ధర.
● వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు క్రియాశీలకంగా సేకరణ సంస్థల నిర్వహణ. దేశంలో ఉత్పత్తి అయ్యే పంట ధాన్యాల ధరల సూచీ పట్టికలను ఆయా మార్కెట్ యార్డులలో ఏర్పాటు చేయడం.
● వ్యవసాయ బీమా లోటుపాట్లు సవరించి, ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లింపులు చేపట్టడం. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పై రైతులకు అహగాహన కల్పించడం.
● రైతులతో పాటు కౌలు రైతులకు రుణసౌకర్యం కల్పించడం.
● వ్యవసాయ రంగానికి సంబంధించిన ఎరువులు, పురుగు మందులు, ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ కొరముట్లు, మైక్రో ఇరిగేషన్ పై జిఎస్ టి తొలగింపు. వ్యవసాయం రంగానికి సంబంధించిన ట్రాక్టర్లు, హార్వెస్టింగ్ మిషన్లు, ఇతర వ్యవసాయ కొరముట్లపై సబ్సిడీ పెంపు.
● వర్షాదారిత వ్యవసాయ భూములకు కనీసం ఒక్క ఆరుతడి పైరుకు నీరందించేడానికి కార్యాచరణ.
● వ్యవసాయ ఆదాయం రెండింతలు అవ్వడానికి వ్యవసాయంతో పాటు పశువుల పెంపును ప్రోత్సహించడం.
పై తీర్మానాలను అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బొజ్జా దశరథ రామి రెడ్డి కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రీ బడ్జెట్ మీటింగ్ లో ప్రభుత్వానికి అందచేస్తారు
అదేవిధంగా సాగునీటి వినియోగం, రైతుల ఆదాయం ను రెండింతలు చేయడానికి చేపట్టవలసిన కార్యాచరణ పై నీతి అయోగ్, వరల్డ్ బ్యాంక్ డిసెంబర్ 18 న ఏర్పాటు చేసిన సమావేశంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రక్షిత సాగునీరు, నూనె మరియు పప్పు గింజలు ఉత్పత్తిని ప్రోత్సహించడానికి చేపట్టవలసిన అంశాలను అఖిల భారత రైతుసంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బొజ్జా దశరథ రామిరెడ్డి వివరిస్తారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు వై.యన్.రెడ్డి, ఏర్వ రామచంద్రారెడ్డి,చెరుకూరి వెంకటేశ్వరనాయుడు,బిజ్జల కృష్ణమోహన్ రెడ్డి,సౌదాగర్ ఖాసీం మియా, నిట్టూరు సుధాకర్ రావు, భాస్కర్ రెడ్డి, పట్నం రాముడు, షణ్ముఖరావు, రాఘవేంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.