తనంటే వైసిసి మంత్రులు బాగా బయపడుతున్నట్లుందని తెలుగుదేశం ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారాలోకేశ్ వ్యాఖ్యానించారు.
తన మీద అనేక రకాలుగా దుష్రచారాలు చేస్తున్నారని అంటూ తను లేని అసెంబ్లీలో ఆరోపణలు గుపిస్తున్నారని, కౌన్సిల్ లో మాత్రం తను ఎదురుగా ఉన్నాకూడా ఒక్క మాటా మాట్లాడటం లేదని ఆయన అన్నారు.
తనంటే అంత భయమెందుకు అని ప్రశ్నించారు.
ఇకనుంచైనా దుష్ప్రచారాలు మానుకుని ప్రజాసమస్యల గురించి చర్చించాలని ఆయన వైసిపి మంత్రులకుసూచించారు. తాను వైసిపి నేతలతో చర్చకు సిద్ధమని అన్నారు. ఆయన మీద ఉన్న కేసులన్నింటి మీద చర్చకు సిద్ధమని అన్నారు.
ప్రజల సమస్యల గురించి శాసనసభలో తెదేపా మాట్లాడితే… సమాధానం చెప్పలేక ఆ సభలో లేని నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నవారికి, ఇదే నా సవాల్! అని టిట్టర్ లో గర్జించారు.
ఇంకా ఆయన ఏమంటున్నారో ఈ ట్వీట్ లో వినండి.
ప్రజల సమస్యల గురించి శాసనసభలో తెదేపా మాట్లాడితే… సమాధానం చెప్పలేక ఆ సభలో లేని నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నవారికి, ఇదే నా సవాల్!#JaganFailedCM#YSPappuBatch pic.twitter.com/QhoBNmixwW
— Lokesh Nara (@naralokesh) December 11, 2019