ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రగతి భవన్లో ఈ సాయంత్రం 5 గం. లకు కీలక మంత్రివర్గ సమావేశం జరగనుంది. సమావేశంలో 2019-20 బడ్జెట్లో వివిధ శాఖలకు జరిపిన కేటాయింపులను క్యాబినెట్ పున: సమీక్ష చేయనుంది. ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలు మినహా మిగిలిన వాటికి కేటాయించిన నిధులను శాఖల వారీగా కొంతమేరకు తగ్గించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, రాబడి పెరగకపోవడం, జిఎస్ టి సమస్యల వల్ల అప్రధానాంశాలకు కేటాయించిన నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించే అవకాశం ఉంది.
దీనికోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులు ఒక నోట్ తయారు చేసి మంత్రివర్గం ముందు ఉంచనున్నారు. స్టేట్ ఫైనాన్స్ స్టేటస్ పై మంత్రులకు ఒక బుక్ లెట్ ను అందించే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిసితులను క్షుణ్ణంగా వివరించే వివిధ శాఖల బడ్జెట్ ల మీద కోత విధించే అవకాాశాలున్నాయని తెలిసింది.
ఇక కొన్ని చట్టాలలో సవరణలు చేస్తూ ప్రభుత్వం జారీ చేయనున్న ఆర్డినెన్సుకు కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది.