చాలా రోజుల తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ ఎంపి యాక్టివ్ అవతున్నారు. రాష్ట్రానికి రావలసిని జిఎస్ టి బకాయీలను వెంటనే విడుదల చేయాలని ఆమె ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ రోజు పార్లమెంటు ఆవరణలో ఈ డిమాండ్ మీద గాంధీ విగ్రహం దగ్గిర ధర్నా చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపిలకు మద్దుతు తెలిపారు. ఈ విషయాన్ని ఆమె ప్రధాని దృష్టికి తీసుకుస్తూ కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని కేవలం నినాదంగా మిగిలించవద్దని ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు.
గత లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకర్గంలో ఆమె బిజెపి అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆమె పబ్లిక్ లైఫ్ కనుమరుగయ్యారు. ఎక్కడా ఏ కార్యక్రమంలో పాల్గొనడం లేదు. హూజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. అలాగే బతుకమ్మ పండగ వేడుకల్లో కనిపించలేదు. తెలంగాణ వచ్చినప్పటినుంచి ఆమె బతుకమ్మను అంతర్జాతీయ చేస్తూ వచ్చారు. విదేశాలలో పర్యటించి బతుకమ్మవేడకలను నిర్వహిస్తూ తెలంగాణ ఐడెంటిని ప్రచారం చేస్తూ వచ్చారు. ఆమె కార్యక్రమాలకు ప్రోత్సాహమిస్తూ ప్రభుత్వం కూడా బతుకమ్మ ఉత్సవాలకు భారీగా నిధులందిస్తూ వచ్చింది. మొదటిసారి ఆమె పాత్ర లేకుండా గత బతుకుమ్మ ఉత్సవాలు నడిచాయి.
ఈ నేపధ్యంలో ఇపుడు మళ్లీ కవిత యాక్టివ్ అవుతున్నారనిపించేలా ఆమె ఈ రోజు ట్వీట్ చేశారు. Cooperative federalism cannot just remain a slogan.@narendramodi Ji pls take note&what is rightfully Telangana’s share in GST,BRGF& other central Govt dues should be released timely.MPs protesting in parliament for what should be a regular transaction between centre&state is sad. https://t.co/yMNl0tf8E2
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 11, 2019
Cooperative federalism cannot just remain a slogan.@narendramodi Ji pls take note&what is rightfully Telangana’s share in GST,BRGF& other central Govt dues should be released timely.MPs protesting in parliament for what should be a regular transaction between centre&state is sad. https://t.co/yMNl0tf8E2
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 11, 2019