ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పర్యటనతో ఈ రోజు గజ్వేల్ కలకలలాడింది. దేశంలోని విఐపి నియోజకవర్గాలలో గజ్వేల్ ఒకటి. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం స్వరూపం మారిపోతూ ఉంది. ఈ రోజు ఆయన గజ్వేల్ లో పర్యటించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కొన్నింటిని పర్యవేక్షించారు. ఆయన పర్యటన విశేషాలు :
మొదట హైదరాబాద్ శివారు ములుగులోని ఫారెస్ట్ కాళేజ్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సిఆర్ఐ) ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఈటెల రాజేందర్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్త తదితరులు ముఖ్యమంత్రి వెంట వున్నారు.
పిసిసిఎఫ్ ఆర్ శోభ, ఎఫ్సిఆర్ఐ డీన్ చంద్ర శేఖర్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, కాలేజ్ స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.