అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ (United States Commission on International Religious Freedom) భారత హోమ్ మంత్రి అమిత్ షాతో పాటు మరికొందరు భారతీయ ప్రముఖ నాయకుల మీద మీద ఆంక్షలు విధించాలనుకుంటున్నది. పొరుగు దేశాల హిందువులకు భారత దేశంలో పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించిన సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ బిల్ (CAB) ను నిన్న లోక్ సభ సభ ఆమోదించినందుకు నిరసనగా USCIRF ఈచర్య తీసుకోవాలనుకుంటున్నది.
USCIRF స్వయంప్రతిపత్తి ఉన్న అమెరికా ఫెడరల్ సంస్థ.
ఈ బిల్లు లో క్ సభలో పాస్ కావడం పట్ల USCIRF ఆందోళన వ్యక్తం చేసింది. ఈ బిల్లును ముస్లింల మీద వివక్ష చూపుతున్నదని అంటూ భారత పౌరసత్వం పొందేందుకు ఈ బిల్లు మతాన్ని ఒక అర్హతగా చేసిందని కమిషన్ పేర్కొంది. లోక్ సభలో పాసయ్యాక ఈ బిల్లు రాజ్యసభ కు వెళ్లుతుంది. ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించాక హోమ్ మంత్రి అమిత్ షా మీద, దీని వెనక ఉన్న ప్రభుత్వ ప్రముఖల మీద అమెరికా ఆంక్షలు విధించాలని కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
“The CAB enshrines a pathway to citizenship for immigrants that specifically excludes Muslims, setting a legal criterion for citizenship based on religion. The CAB is a dangerous turn in the wrong direction; it runs counter to India’s rich history of secular pluralism and the Indian Constitution, which guarantees equality before the law regardless of faith.”అని కమిషన్ ప్రకటనలో పేర్కొంది.
నిజానికి ఈ బిల్లు గతంలో 2019 జనవరిలో కూడా లోక్ సభలో ప్రవేశపెట్టారు.రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టారు.అయితే సర్వత్రా నిరసనలు వ్యక్తం కావడంతో వోటింగ్ ముందు బిల్లును ఉపసంహరించుకున్నారు. అయితే, ఎన్నికల్లో గెలిస్తే, బిల్లును తిరిగి ప్రవేశపెడతామని 2019 మే ఎన్నికలప్పటి పార్టీ మ్యానిఫెస్టోలో బిజెపి పేర్కొంది.
USCIRF is deeply troubled by the passage of the Citizenship (Amendment) Bill (CAB) in the Lok Sabha. The CAB enshrines a pathway to citizenship for immigrants that specifically excludes Muslims, setting a legal criterion for citizenship based on religion.https://t.co/E8DafI6HBH
— USCIRF (@USCIRF) December 9, 2019