చెట్టు ని “ఢీకొట్టిన “వాహన దారునికి 9,500 జరిమానా
సిద్దిపేట పట్టణంలో ఈ సంఘటన జరిగింది. పట్టణంలోని వైద్య కళాశాల వద్ద హరితహారంలో భాగంగా నాటిన మొక్క ను టాటా సుమో వాహనం(కింది ఫోటో) ఢీ కొట్టడంతో చెట్టు పడిపోయింది.
దీనిని సమీపంలో ఉన్న పోలీసులు గమనించి హరితహారం అధికారి ఐలయ్య కు సమాచారం అందించారు. దీనితో హరిత హారం అధికారి ఐలయ్య హుటాహుటిని పరిగెత్తుకుటూ వచ్చి వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపిన రాకేష్ కి రు 9,500 (తొమ్మిది వేల ఐదు వందల రుపాయల) జరిమానా విధించారు.
హరితహారం మొక్కలను పెంచేందుకు సంరక్షించేందుకు నెలా నెలా లక్షల రూపాయలు వెచ్చిస్తున్నామని, వాటికి ఎవరు హాని కలిగించిన జరిమానా చెల్లించాల్సిందే ననిచ ఐలయ్య చెప్పారు.
‘ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆదేశాల మేరకు సిద్దిపేట ని హరిత సిద్దిపేట గా మార్చడమే ద్వేయంగా ముందుకు సాగుతున్నాం. హరితహారం చెట్ల భద్రత అందని బాధ్యత. ఈ విషయంలో సిద్దిపేట పోలీస్ క అధికారులు అందరికి , మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ ప్రత్యేకంగా సహకరిస్తున్నారు. అందువల్ల ఈ మొక్కలకుహాని చేస్తే తగిన మూల్యంచెల్లించాల్సి ఉంటుంది.’అని హరితహారం అధికారి సామల్ల ఐలయ్య తెలియజేశారు.