ఇది బాగా షాకింగ్ న్యూసే.ప్రపంచ వ్యాపితంగా, రోగం నయంచేసి ప్రాణంపోయాల్సిన వైద్య వ్యవస్థ ప్రాణాలు తీయడం ఎక్కువవుతోంది. పేద, ధనిక అనే తేడా లేకుండా అన్ని దేశాలలో మరణాలలో హృద్రోగాలది నెంబర్ వన్ స్థానం. తర్వాతి స్థానం క్యాన్సర్ ది రెండోస్థానం. మరి మూడో స్థానం ఏది? వైద్య వైఫల్యం అంటే మెడికల్ ఎర్రర్.
ఇదేదో ఇండియా లేదా పాకిస్తాన్ లేదా రువాండా వంటి దేశాలలో మెడికల్ ఎర్రర్ వల్ల పదికాలాలు బతకాల్సిన రోగులు పుటుక్కున రాలిపోతున్నారంటే, వెనకబడిన దేశాల్లే అనుకోవచ్చు. కాని అమెరికాలో కూడా మెడికల్ ఎర్రర్ ల వల్ల చనిపోయే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇలాంటి మరణాలను అయాట్రో జెనిక్ (Iatrogenic) మరణాలుఅంటారు. అంటే మెడికల్ ఎగ్జామినేషన్ లేదా ట్రీట్ మెంట్ సంబంధమయినవి వికటింంచడం వల్ల ఎదురయ్యు చావులన్నమాట.
అపుడపడు మన వూర్లలో డాక్టర్ నిర్లక్ష్యం వల్లే వాళ్ల కుటుంబ సభ్యులు చనిపోయారని బంధువులు హస్పిటల్ దగ్గిర ధర్నా చేయడం చూస్తుంటాం.కొన్ని సార్లు ఇలాంటి మరణాలు విధ్వంసాలకు కూడా దారితీస్తూ ఉంటుంది. ఇలా చనిపోయే వారి సంఖ్య అమెరికాలో కూడా చాలా ఎక్కువే. ఇలాంటి మరణాలు అమెరికా వాళ్లు మెడికల్ ఎర్రర్ (Medical Error) వల్ల జరిగే మరణాలుగ వర్గీకరించారు. ఇలాంటి మెడికల్ ఎర్రర్ మరణాలు అమెరికాలో ఇపుడు బాగా ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా ఆసుపత్రులలో సంభవిస్తున్న మరణాలలో మూడో పెద్ద కారణం మెడికల్ ఎర్రరే.ఈ విషయం అనేక పరిశోధనల్లో వెల్లడయింది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (Centre for Disease Control and Prevention: CDC) ఈ విషయాన్ని ధృవకరించింది. ఆసుపత్రులలో సంభవించే మరణాలు, మరణాల సర్టిఫికెట్లు, ఫ్యునెరల్ డైరెక్టర్స్, మెడికల్ ఎగ్జామినర్స్ ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా సిడిసి ఈ వివరాలు సేకరించి అవాక్కయిపోయింది.
2016లో బ్రిటిష్ మెడికల్ జర్నల్ (British Medical Journal) జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ (Johns Hopkins University School of Medicine) శాస్త్ర వేత్తలు Medical Error: Third Leading Cause of Death in the US అని ఒక పరిశోధనా పత్రం ప్రచురించారు. ఈ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం అమెరికాలో యేటా 2,50,000 మంది రోగులు మెడికల్ తప్పిదాల వల్ల చనిపోతున్నారు. రోగుల మరణాలలో ఆసుపత్రుల లేదాడాకర్ల తప్పిదాల వల్ల చనిపోవడమనేది అమెరికాలో మూడో పెద్ద కారణమని ఈ పరిశోధనా పత్రం రాసిన మార్టిన్ మేకరీ, మైఖేల్ డేనియల్ (Martin A Makary and Michael Daniel) తేల్చారు. మిగతా రెండుకారణాలు – గుండె జబ్బులు (647,457), క్యాన్సర్ (599,108). ఇవన్నీ కూడా 2018 నాటి సిడిసి తాజా లెక్కలే.
మెడికల్ ఎర్రర్ అంటే…
మేకరే, డేనియల్ నిర్వచనం ప్రకారం మెడికల్ ఎర్రర్ అంటే వైద్య విదానంలో వికటించి అనుకోకుండా ఎదరయ్యే మరణం. ఇది డాక్టర్ అనుకున్న ప్రణాళిక పనిచేయకపోవడం వల్ల జరగవచ్చు లేదా రోగాన్ని సరిగ్గా డయగ్నోజ్ చేయకపోవడం వల్ల జరగవచ్చు లేదా డాక్టర్ సంప్రదాయక వైద్యం నుంచి వైదొలగి కొత్త పద్దతిలోకి మారడం వల్ల జరగవచ్చు.
Medical error has been defined as an unintended act (either of omission or commission) or one that does not achieve its intended outcome, the failure of a planned action to be completed as intended (an error of execution), the use of a wrong plan to achieve an aim (an error of planning), or a deviation from the process of care that may or may not cause harm to the patient.
మెడికల్ ఎర్రర్ వల్ల ఒక్కొక్కసారి రోగికి ప్రమాదం లేకపోవచ్చు. అయితే,కొన్ని సార్లు నమమయిన పదికాలాలు బతకాల్సిన రోగి ఈ విధానాల వల్ల అకాలంగా చనిపోతాడు. అమెరికాలో ఆసుప్రతి మరణాలలో గుండె జబ్బుల, క్యాన్సర్ తర్వాత మెడికల్ ఎర్రర్ మూడో పెద్ద కారణం కావడమనేది ఆందోళన కలిగించే విధానం.
ఆలాంటి మరణాలు పేద,వర్ధమాన దేశాలలో జరిగితే అర్థం చేసుకోవచ్చు. అయితే, అమెరికా వంటి దేశాలలో జరగమనేది తీవ్రంగా పరిగణించాలి. ఇలాంటి మెడికల్ ఎర్రర్ వల్ల మరణాలు వర్ధమాన దేశాలలో 26లక్షల దాకా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్యం సంస్థ వెల్లడించింది. ఈ మరణాలన్నీ కూడా జబ్బును సరిగ్గా గుర్తించకపోవడం, తర్వాత జబ్బుకు తప్పుడు ఔషధాలు ఇవ్వడం వల్ల సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.