ప్రస్తుతం రాష్ట్రంలో పది కోట్ల టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. వచ్చే పది ఏళ్లకు సరిపడా ఇసుక అందుబాటులో ఉంది. సగటున రోజుకి 3 లక్షల 80 వేల టన్నుల ఇసుక లభ్యం అవుతుంది. కొరతనేది లేదని గనుల శాఖ మంత్రి పె్ద్దిరెడ్డి రామ ప్రచంద్రారెడ్డి అన్నారు.
ఇసుక మీద ఆయన ఈ రోజు ఇచ్చిన వివరణ ఇది-
ప్రస్తుతం రాష్ట్రంలో 130 రీచ్ లు పనిచేస్తున్నాయి. 158 స్టాక్ యార్డ్ లు.108 డిపో లు అందుబాటులో ఉన్నాయి. గత ఐదేళ్లు యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేశారు.వర్షాల వల్ల ఇసుక కొరత వస్తే దుర్మార్గపు రాజకీయాలు చేశారని ఆయన విమచారు.
ఉచిత ఇసుక విధానం అంటూ వేల కోట్లు దోచేశారు.ఇసుక పాలసీ లో పటిష్ట వ్యవస్థను తీసుకు వచ్చాం. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక అక్రమ రవాణా జరగడం లేదు. అక్రమ రవాణా అరికట్టడానికి 400 చెక్ పోస్టులు పెట్టాం.అక్రమంగా వ్యాపారం చేస్తే కఠిన చర్యలకు అసెంబ్లీ లో చట్టం చేయబోతున్నాం.ఇసుక అక్రమ రవాణా చేస్తే 2లక్షల రూపాయల జరిమానా,రెండేళ్లు జైలు శిక్ష .పదే పదే ఇసుక అక్రమ రవాణా చేస్తే పీడీ యాక్ట్ అమలుచేస్తాం – అని హెచ్చరించారు.