అవినీతి పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొరడా ఝళిపించారు. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి తారసపడితే,వెంభటనే ఫిర్యాదుచేసేందుకు టోల్ ఫ్రీ పోన్ నెంబర్ ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్. అవినీతి మీద కాల్ సెంటర్ కు ఎవరైనా ఫిర్యాదుచేస్తే 15 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తారు. కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్:14400.
కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అవినీతి వ్యతిరేక హెల్ప్ లైన్ మొదలయింది. 2015 ఫిబ్రవరిలో పంజాబ్ విజిలెన్స్ విభాగం హెల్ప్ లైన్ ప్రారంభించింది. నెంబర్ 1800-1800-1000. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ కూడా 2015 లోనే టోల్ ఫ్రీ నెంబర్ లాంచ్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వ అవినీతి నిరోధక నెంబర్ 1031. తెలంగాణ ప్రభుత్వం కూడా 1064 టోల్ ఫ్రీనెంబర్ ప్రారంభించింది.ఉత్తర ప్రదేశ్ లో కూడా ఉంది. అయితే, ఈ నెంబర్ ప్రారంభించిన తర్వాత అవినీతి ఏ మేరకు తగ్గిందో ఇంకా నివేదికలు వచ్చినట్లు లేవు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నప్పటినుంచి జగన్ అవినీతి నిర్మూలనకు చాలా ప్రామఖ్యం ఇస్తున్నారు. ఈ విషయంలో తగిన అధ్యయనం చేసి సలహా లిచ్చేందుకు ఆయన అహ్మదాబాద్ ఐఐఎం వనిపుణులను ఆహ్వానించారు. ఈ కమిటి 2020 ఫిబ్రవరికి నివేదిక ఇస్తుంది.