బిజెపిని జంకుగొంకు లేని హిందూత్వ పార్టీగా మార్చి మోదీ ప్రధాన మంత్రి అయితే, హిందూత్వ సిద్ధాంతాన్ని సెక్యులర్ మిక్స్ చేసి శివసేన అధినేత ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నారు. ఎన్ సిపి, కాంగ్రెస్ లు ఆయనకు మద్దతు నిచ్చాయి. మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన ధాకరే కుటుంబం నుంచి ఇంతవరకు ఎవరూ పవర్ పగ్గాలుపట్టలేదు. ఇపుడు తొలి నాయకుడాయనే అవుతారనుకుంటున్నారు. అయితే, ఈ రోజు ఉదయం అంతా తారుమారయింది. పొద్దనే తెల్ల వారీవారక ముందే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి ధాకరే చేతికందబోతున్న పదవి లాగేసుకున్నారు. ప్రధాని ఫడ్నవీస్ కు అభినందనలు చెప్పారు.
ఉధ్దవ్ బయాగ్రఫీ ఇది..
మొట్టమొదటి సారి శివసేన ఫస్ట్ ఫామిలీ నుంచి ఒకరు అధికారంలోకి వస్తున్నారనుకున్నారంతా.
శివసేన పార్టీని తండ్రి బాల్ ధాకరే 1966లో స్థాపించారు. మహారాష్ట్ర రాజకీయాలను ఆయన శాసించారు. తనమాటే శాసనంగా నడిపారు. అయినా సరే, ఆయన పొంతంగా అధికారం చేపట్టలేదు. కుటుంబ సభ్యలుకుపంచలేదు. తను మాతోశ్రీ (నివాసం)లో కూర్చునే చక్రం తిప్పారు. ముంబయిలో ఏ ప్రముఖడయినా సరేమొదట తనని సందర్శించే లా చేసుకున్నారు. తానుబతికుండాగా ఆయన తప్పమరొకరిని కుటుంబం నుంచి రాజకీయాల్లోకి తీసుకురాలేదు. కథ తాను నడిపిస్తూ పదవులను అందరికీ పంచారు.అందుకే భారత రాజకీయాలలో శివసేన సంస్థాపకుడు బాల్ ధాకరే విశిష్టమయిన వ్యక్తి. నిజమయిన పవర్ తన దగ్గిర ఉంచుకుని హంగు అర్భాటాలున్న ప్రభుత్వాధికారాన్ని పార్టీనేతలకు ఇచ్చేశారు.
ప్రభుత్వాధికారం మీద వ్యామోహం చంపుకోవడం అంత సులభం కాదు. ఆపని ఇటీవలి కాలంలో ఇద్దరే ఇద్దరు వ్యక్తలు చేశారు. అందువలో ఒకరు బాల్ థాకరే, రెండో వ్యక్తి బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించిన కాన్షీరామ్. మిగతా నాయకులంతా పదవుల వ్యామోహంలో పడిన వాళ్లే.
ఇలాంటి బాల్ థాకరే మూడో సంతానం ఉద్దవ్ ధాకరే. ఉద్దావ్ జూలై27,1960 లో జన్మించారు. తల్లి మీనాతాయ్. ఆయనకు బిందుమాధవ్, జయదేవ్ అనే అన్నలున్నారు. వాళ్ల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు.
భాల్ ధాకరే మరణం (2012) తర్వాత శివసేన చాలా మార్పులకు లోనయింది. సోదరుడు (సొంత సోదరుడు పిన్ని కొడుకు) రాజ్ ధాకరే , ఉద్దవ్ లు బాల్ థాకరే వారసత్వాన్ని చీల్చుకున్నారు.
శివసేన కు ఉద్దవ్ ధాకరే అధ్యక్షుడు (శివసేన ప్రముఖ్ ). రాజ్ ధాకరే వేరే దుకాణం నడుపుతున్నారు. ఉధ్దవ్ థాకరే రాజకీయ ప్రస్తానం నిజానికి నిశబ్దంగా మొదలయింది. మొదట ఆయన పార్టీ దినపత్రిక సామ్నా(Saamna) వ్యవహారాలు చూసేశారు. ఉద్దవ్ పత్రిక వ్యవహారాల్లోకి వెళితే, రాజ్ థాకరే రాజకీయాల్లోకి వచ్చారు.భారతీయ విద్యార్థిసేనను స్థాపించి బాల్ థాకరే ఆయనను అధ్యక్షుడిని చేశారు.
ఉధ్దవ్ కు చిన్నాన్న (రాజ్ ధాకరే తండ్రి శ్రీకాంత్ థాకరే)డింగా అనే ముద్దు పేరు పెట్టారు. రాజ్ ధాకరే తల్లి కుందా, ఉద్దావ్ ధాకరే తల్లి అక్కా చెల్లెళ్లు. ఉద్దవ్ ఎపుడూ చాలా వినయంగా విధేయంగా ఉండే వాడు కాబట్టి శ్రవణ్ బల్ అనే పేరు పెట్టారు.
ఉద్దవ్ జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి డిగ్రీ పొందారు. ఆయన మంచిఫోటో గ్రాఫర్ గా పేరు తెచ్చుకున్నారు. జెజె స్కూల్ నుంచి ఆప్లయిడ్ అర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేశాక, కొంతమంది మిత్రులతో కలసి ఆయన ‘చౌరంగ్’ అనే పేరుతో అడ్వర్టయిజింగ్ ఏజన్సీని స్థాపించారు. ఆయన మంచి వక్త కూడా.
రాజ్ ధాకరే పూర్తి పేరు స్వరరాజ్ ధాకరే. ఈ పేరు పెట్టింది. బాల్ థాకరే. చివరకు ఆయన పేరు రాజ్ ధాకరే గా స్థిరపడింది. రాజ్ ధాకరే కూడా ఇదే కాలేజీలో చదువుకున్నారు. బాల్ ధాకరేకు ఆయన అంటే చాలా ఇష్టం. పెద్ద నాన్న ప్రభావంతో కార్టూన్ లు కూడా వేయడం నేర్చుకున్నారు. ఉద్ధవ్ లాగే రాజ్ కూడా ‘చాణక్య’ పేరుతో అడ్వర్టయిజింగ్ ఏజన్సీప్రారంభించారు. రాజ్ మరాఠీ నటుడు మోహన్ వగ్ కూతురు షర్మిలను వివాహమాడారు.
1995-99 మధ్య శివసేన-బిజెపి కలసి అధికారంలో ఉన్నపుడు కూడా ఆయనకు ఏ పదవి లేదు. కాకపోతే, సభలలో తండ్రి బాల్ ధాకరే తో పాటు కనిపించేవాడు.
2003లో మహాబలేశ్వర్ లో జరిగిన పార్టీ సభలో ఉధ్దావ్ ను ఎగ్జిక్యూటివ్ ప్రెశిడెంటు గానియమించాలని రాజ్ ధాకరే ప్రతిపాదించాడు. అపుడు బాల్ ధాకరే వయసు 76 సంవత్సరాలు. అయితే రాజ్ తో ఈ సఖ్యతను ఉద్దవ్ కొనసాగించలేకపోయారు. ఇద్దరి మధ్య విబేధాలొచ్చాయి. ఇవి ఎంతగా ముదిరాయంటే రాజ్ ను చివరకు పార్టీ నుంచి బహిష్కరించాల్సి వచ్చింది. రాజ్ గత్యంతంర లేక పార్టీ నుంచి 2005 లో తప్పుకున్నారు. మరుసటి సంవత్సరం మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన అని కొత్త పార్టీ (2006)ఏర్పాటుచేసుకున్నారు.
ఈ మధ్యలో ఉద్దవ్ కూడా రాజకీయాలు బాగా నేర్చుకున్నారు. పార్టీలో తనకు పోటీ అవుతారని భావించిన అందరిని తప్పించారు. ముందు నారాయణ్ రానే ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన పనితీరు బాగో లేదని విమర్శించి ఆయన బయటకు పోయేలా చేశారు. తర్వాత వదిన స్మిత (జయ్ దేవ్ భార్య) ప్రాముఖ్యంగా కూడా తగ్గించారు. తర్వాత ఆమె పార్టీ నుంచి కనుమరుగయ్యారు.
ఒక దశలో చనిపోవడానికి కొద్ది రోజులు ముందుకు శివసేన సభలో చివరి ప్రసంగం చేస్తూ ఉద్దవ్ ను సమర్థించడండని బాల్ ధాకరే పిలుపునీయడంతో విబేధాలు తారాస్థాయికొచ్చాయ్. 2014లొ శివసేన బిజెపి ప్రత్యర్థులుగా పోటీ చేశాయి. అయితే, ఎన్నికలయ్యాక కలసి ప్రభుత్వం ఏర్పాటుచేశాయి.
అయితే,ఉధ్దవ్ మాత్రం బిజెపి నాయకత్వాన్ని అంటే మోదీ, షా విధానాలను విమర్శిస్తూనే వచ్చారు. అయితే, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో మాత్రం సఖ్యంగానే ఉంటూ వచ్చారు.
2019 ఎన్నికలపుడు దసరా ఉత్సవాలలో ఆయన ఈ సారి శివసేన నేత ముఖ్యమంత్రి అవుతాడని ప్రకటించారు.దీనితో బిజెపి శివసేన మధ్య గ్యాప్ పెరగడం మొదలయింది. ఉధ్దవ్ కు రష్మి పటాన్ కర్ తో వివాహమయింది (1988). ఆయనకు ఇద్దరు కుమారులు. ఇందులో ఒకరు ఆదిత్య ఇపుడు ఎమ్మెల్యే, రెండో కుమారుడు తేజస్ రాజకీయాలకు దూరం. ఆయన పర్యావరణ కార్యకర్త.