భారత్ లో ఇదిపుడు కొత్త తీవ్రవాది, ఎంతమందిని మంచాన పడేసిందో తెలుసా?

వీపున తెల్లటిచారలున్న ఈ కీటకం చాలా ప్రమాదకమయింది. ఒక్క మాటలో చెబితే తీవ్రవాదిలా ఇపుడిది భారతీయలు మీద దాడి చేస్తూ ఉంది. అధికారులను, ప్రజలను  వణికిస్తున్న ఈ  చిన్న రెక్కల  ప్రాణియే డెంగీ దోమ (Aedes Aegypti).
అధికారిక లెక్కల ప్రకారం,  ఈ ఏడాది అక్టోబర్ 13 నాటికి, వేలితో నలిస్తే నుజ్జు నుజ్జయ్యే ఈ కీటకం  మొత్తం 67 377 మందిని కాటేసింది.  48 మంది చనిపోయారు. ఈ లెక్కలను నేషనల్ వెక్టార్ బార్న్ డీసీసెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ (Nation Vector Borne Diseas Control Programme) డైరెక్టోరేట్ విడుదల చేసింది.
తెలంగాణాలో ఈ చిన్న దోమ ఎంత భీభత్సం సృష్టిస్తున్నదో వేరే చెప్పనవసం లేదు. మంచిర్యాల లో  ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు 15 రోజుల వ్యవధిలో డెంగీజ్వరంతో చనిపోయి ఒక చిన్నారి పాన అనాధను చేసిన దోమ ఇది. అంతేకాదు, అక్టోబర్ 21న ఖమ్మమ్ కు చెందిన సివిల్ జడ్జి జయమ్మ చనిపోయారు. దీనితో న్యాయవాదులు కోర్టును బహిష్కరించారు. అక్టోబర్ 30నాటికి రాష్ట్రంలో దాదాపు 50 వేల డెంగీ పాజిటివ్ కేసులను గుర్తించారు.
గత అక్టోబర్ 13 నాటికి కర్నాటకలో ఈ దోమ కాటు వల్ల ఆసుపత్రిలో పడిన వారి సంఖ్య12,576 . ఇదే ఇండియా లో టాప్ ఈ రాష్ట్రం లో డెంగీఫీవర్ 8 మంది చనిపోయారు. తర్వతి స్థానం 7863 కేసులతో మహారాష్ట్రది. ఇక ఉత్తరాఖండ్ నుంచి 7513 కేసులు నమోదయితే మరణాలు 13. గుజరాత్ లో 5819 కేసులు నమోదయ్యాయి.ఆరుగురు చనిపోయారు.
ఈ దోమ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి.